By: ABP Desam | Updated at : 16 Nov 2021 07:29 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ కలహాలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక జీవితంలో ఎన్నో సమస్యలు. ఆ సమస్యల ఫలితం మానసిక ఒత్తిడి, ఆందోళన. ఈ రెండింటి వల్ల ప్రశాంతం నిద్రపోలేరు, తినలేరు, ఓ దగ్గర స్థిరంగా కూర్చోలేరు కూడా. మీ మానసిక ఆందోళనను తగ్గించేందుకు కొన్ని రకాల ఔషధ టీలు సహాయపడతాయి. వీటిని రోజుకు రెండు సార్లు తాగడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ఏ టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
1. అశ్వగంధ టీ
శతాబ్ధాలుగా సాంప్రదాయ ఔషధాలలో అశ్వగంధను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక అడాప్టోజెన్. అంటే శరీరంలోని ఒత్తిడికి తగినట్టు పనిచేస్తుంది. దీన్ని టీ రూపంలో తీసుకోవచ్చు. ఇది శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత మానసిక ఆందోళనకు, బరువు పెరగడం, ఒత్తిడికి కూడా కారణమవుతుంది. డిప్రెషన్, యాంగ్జయిటీతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
Read Also: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
2. దాల్చిన చెక్క బ్లాక్ టీ
దాల్చిన చెక్క వాసన పీల్చినా శరీరానికి ఉత్తేజంగా అనిపిస్తుంది. తద్వారా కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు. వేటి టీకప్పులో దాల్చిన చెక్క పొడిని చేర్చినా చాలు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంత్ పాటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుండె ఆగిపోవడం, ఊబకాయం, రక్తపోటు వంటివి ఒత్తిడి వల్ల కలిగే అవకాశం ఉంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి కనుక రోజూ ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
3. గ్రీన్ టీ
గ్రీన్ టీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నరాలలో రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉండవు. ప్రశాంతంగా సాగుతుంది ప్రవాహం. థియనైన్ అనే అమైనో ఆమ్లం ఇందులో ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. ఒత్తిడిని అధిగమించడానికి సహాయపడుతుంది. జపాన్ లోని ఒక విశ్వ విద్యాలయంలో జరిపిన పరిశోధనలో గ్రీన్ టీ తాగే విద్యార్థులు తక్కువ ఒత్తిడికి గురవుతున్నట్టు తేలింది.
Read Also: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
4. తులసి టీ
తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మెమొరీ, కాగ్నిటివ్ ఫంక్షన్ పై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. తులసి టీ తాగడం వల్ల ఎలా దుష్ర్పభావాలు కలగవు కాబట్టి ఎవరైనా తాగచ్చు.
Read Also: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి
బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!
HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
Skin Care: బాయ్స్, రోజూ ఈ టిప్స్ పాటిస్తే చాలు, వృద్ధాప్య ఛాయలు మాయమై యంగ్‌గా కనిపిస్తారు!
మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు రకాల ఆహారాలు ఇవే
Telangana Budget 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు, రాష్ట్రంలో మరిన్ని ఐటీ టవర్లు, పరిశ్రమలకు రూ.4,037 కోట్లు!
Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR On Fans : ఎన్టీఆర్ కోపానికి కారణం ఏమిటి? తమిళ హీరోలను చూసి నేర్చుకోవాలా?