(Source: ECI/ABP News/ABP Majha)
Phantom or False pregnancy: గర్భం రాకపోయినా... గర్భం ధరించినట్టు అనిపించే లక్షణాలు, నమ్మి మోసపోకండి
గర్భధారణ సమయంలో కనిపించే లక్షణాలే బయటపడతాయి, కానీ గర్భం రాదు. అదే ఫాల్స్ ప్రెగ్నెన్సీ.
గర్భం ధరించినట్టు మొదట ఎలా సందేహం వస్తుంది? నెలసరి రాదు, నీరసంగా అనిపిస్తుంది, రొమ్ములలో ఇబ్బందిగా ఉంటుంది, వాంతులు, వికారం వస్తుంటాయి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గర్భం వచ్చిందేమో అని అనుమానిస్తాం. వైద్యుడిని కలిసి వచ్చిందో లేదో రూఢీ చేసుకుంటాం. కానీ పై లక్షణాలన్నీ కనిపించినా కూడా గర్భం రాని ఆరోగ్య స్థితి ఒకటుంది... అదే ఫాంటమ్ ప్రెగ్నెన్సీ. దీన్ని వైద్య పరిభాషలో ‘సూడో సైసిస్’ అని కూడా పిలుస్తారు.
ఎందుకిలా జరుగుతుంది?
ఈ ఫాంటమ్ ప్రెగ్నెన్సీ వల్ల ఎంతో మహిళలు తాము గర్భం దాల్చామని భ్రమపడి, చివరికి కాదని తెలిసి మానసికంగా కుంగిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన కారణాన్ని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ఫాంటమ్ ప్రెగ్నెన్సీకి, మహిళల మానసిక స్థితికి మధ్య మాత్రం సంబంధం ఉందని తేల్చారు. కొందరు మహిళలకు త్వరగా గర్భం రాదు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. థైరాయిడ్, సిస్ట్ లు, వీర్యం బలహీనంగా ఉండడం... ఇలా. కానీ ఆ మహిళకు గర్భం ధరించాలన్న కోరిక చాలా బలంగా ఉండి, ఆమెను మానసికంగా కుంగదీస్తుంది. చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఆమె మనస్సులోని బలమైన కోరిక ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు. దానివల్ల గర్భం దాల్చకుండానే, గర్భం దాల్చిన లక్షణాలు బయటపడొచ్చు అని ఒక అంచనాగా చెబుతున్నారు వైద్యులు.
Read Also: డయాబెటిస్ ఉన్న వాళ్లు ఖర్జూరాలు తినొచ్చా? రోజుకు ఎన్ని తినొచ్చు?
హార్మోన్లు కూడా...
ఒక్కోసారి ఫాంటమ్ ప్రెగ్నెన్సీకి హార్మోన్లలోని మార్పులు కూడా కారణం అవుతాయి. హార్మోన్లు సరిగా పనిచేయనప్పుడు... నెలసరి క్రమం తప్పుతుంది, తలనొప్పి, వాంతులు, వికారం కలుగుతాయి. పెళ్ళయిన జంటలు ఈ లక్షణాలను కూడా గర్భధారణ లక్షణాలుగా అనుకుంటారు. ఎన్నో ఆశలు పెంచుకుంటారు. తీరా ఆసుపత్రిలో పరీక్షలు చేస్తే నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది. పిల్లల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసే జంటలు... ఆ క్షణంలో చాలా నిరాశకు గురవుతారు. అందుకే ఫాంటమ్ ప్రెగ్నెన్సీ విషయంలో ప్రజల్లో చైతన్యం అవసరం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
Read Also: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Read Also: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి