Diabetes: డయాబెటిస్ ఉన్న వాళ్లు ఖర్జూరాలు తినొచ్చా? రోజుకు ఎన్ని తినొచ్చు?
మధుమేహంతో బాధపడుతన్న వాళ్లు తియ్యనైన ఖర్జూరాలను తినవచ్చా? దీనికి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారంటే...
ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతోంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధసడుతున్నవారు ఆచితూచి మరీ ఆహారపదార్థాలను ఎంచుకుంటున్నారు. మధుమేహులు స్వీట్లు తినకూడదు కాబట్టి, ఖర్జూరాలు వంటి సహజసిద్ధమైన తీపి పండ్లను ఎంచుకుంటున్నారు. శుద్ధి చేసిన చక్కెరతో తయారైన స్వీట్ల కన్నా ఖర్చూరాలు చాలా మేలని వారి అభిప్రాయం. అయితే మధుమేహులు ఖర్జూరాలు తినవచ్చా? రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినవచ్చు?
శతాబ్ధాలుగా ఖర్జూరాలు మన ఆహారంలో భాగంగా ఉన్నాయి. సహజమైన తీపిని అందించడంతో పాటూ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయివి. దాదాపు వందగ్రాముల ఖర్జూరంలో 314 కేలరీలు ఉంటాయి. కొన్ని రకాల్లో అంతకన్నా ఎక్కువ కేలరీలు కూడా ఉండొచ్చు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహం ఉన్నవారు రోజుకు మూడు ఖర్జూరాలు తింటే మంచిది.
Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
తినడం మంచిదేనా?
ఖర్జూరాలను మితంగా తీసుకోవడం మధుమేహులకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహులు రోజుకు మూడు లెక్క వీటిని తినడం మంచిదే.
ఖర్జూరాలలో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర నెమ్మదిగా శోషించేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో హఠాత్తుగా చక్కెర స్థాయిలు పెరగవు. ఖర్జూరాలు తింటే త్వరాగా ఆకలి కూడా వేయదు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. తద్వారా ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని కూడా అరికడుతుంది.
మధుమేహులు, ప్రీ డయాబెటిక్ పరిస్థితులలో ఉన్న వారు కూడా ఖర్జూరాన్ని రోజూ తినవచ్చు. కాకపోతే మీ పరిస్థితి నుంచి ఒకటి నుంచి మూడు వరకు తినవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో వైద్యులు ఖర్జూరాలు తినవద్దని సలహా ఇస్తారు. కాబట్టి తినేముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Read Also: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి