By: ABP Desam | Updated at : 17 Nov 2021 05:41 PM (IST)
మోడీకి లేఖ రాసిన కేసీఆర్
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని కోరారు. 2020-21 రబీలో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలన్నారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని చెప్పారు. వచ్చే రబీలో రాష్ట్రం నుంచి ఎంత కొంటారో తెలపాలని స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని.. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదన్నారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదని లేఖలో సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.
పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదన్నారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా.. సేకరించే మొత్తం పెరగట్లేదన్నారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది కేసీఆర్ చెప్పారు. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారైందన్నారు. నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యతతో ఆహార ధాన్యం.. దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు.
ఎఫ్ సీఐతో రైతుల్లో గందరగోళం నెలకొందని.. లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. ఎఫ్‌సీఐ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదన్నారు. ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతుందని తెలిసినా.. ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు మోడీ దృష్టికి తీసుకెళ్లారు.
అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని.. నిర్ధారించడం కోసం.. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో స్వయంగా వెళ్లి కలిశానని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని విజ్జప్తి చేశామని.. కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదని మోడీకి గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని లేఖలో మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్.
Also Read: Siricilla: ఈతకు వెళ్లి నీట మునిగిన ఆరుగురు విద్యార్థులు.. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యం
Also Read: Wife Stabs Husband: తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..
Weather Updates: నేడు తీవ్ర వాయుగుండం - ఏపీకి రెయిన్ అలర్ట్, తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు IMD
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన
Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!
టీడీపీని వీడిన మరో సీనియర్ నేత - పార్టీలో అనుబంధం గుర్తు చేసుకుని కంటతడి !
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?