News
News
X

Siricilla: ఈతకు వెళ్లి నీట మునిగిన ఆరుగురు విద్యార్థులు.. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు నీట మునిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

FOLLOW US: 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈత సరదా ఆరుగురు విద్యార్థులను బలితీసుకుంది. మానేరు వాగులో సరదాగా ఈతకొట్టడానికి దిగిన విద్యార్థులు బాగా లోతులోకి వెళ్లి మునిగారు. ఒకేసారి ఆరుగురు మృత్యువాతపడటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. 

సిరిసిల్ల పట్టణంలో శివనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం  మానేరు వాగులో ఈతకొట్టడానికి వెళ్లారు. నెహ్రు నగర్ చెక్ డ్యాం వద్ద వీరంతా ఈతకు దిగారు. కొందరు విద్యార్థులు నీటిలో లోతులోకి వెళ్లారు. ఇలా ఆరుగురు విద్యార్ధులు మునిగిపోయారు. 

స్నేహితులు నీటిలో మునిగిపోవడంతో.. మిగిలిన ముగ్గురు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక..  ఇంటికి పరుగెత్తారు. అందరికీ ఈ విషయం చెప్పారు. వారిద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న కాలనీవాసులంతా ప్రమాదం  జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే విద్యార్థులంతా మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి వచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఒకరి మృతదేహం లభ్యమైంది.

మిగతా ఐదుగురి కోసం సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు, రెస్క్యూ టీం  గాలింపు చర్యలు చేపటారు. ఈరోజు మరో నలుగురి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.  ఈత రాకపోవడంతో బాటు నీటి లోతుని అంచనా వేయడంలో జరిగిన పొరబాటు ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాంతానికి చెందిన పిల్లలు అదీ ఉత్సాహంగా రోజంతా గడిపిన తరువాత ఆకస్మికంగా మరణించడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు లభ్యమైన విద్యార్థి క్రాంతికుమార్ పుట్టినరోజు కావడంతో తల్లిందండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Also Read: Tomato Price: వంద నోటు ఉంటేనే టమోటా కొనేందుకు వెళ్లండి.. లేకుంటే రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇంటికి వచ్చేయండి

Also Read: Dharmana Prasad : బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి !

Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !

Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Nov 2021 09:17 PM (IST) Tags: Students Siricilla manir rajanna siricilla district swimming

సంబంధిత కథనాలు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Priyanka Batukamma : బతుకమ్మతో ఇందిరాగాంధీ - ప్రియాంకా గాంధీ తెలుగు ఏం చెప్పారంటే ?

Priyanka Batukamma :  బతుకమ్మతో ఇందిరాగాంధీ - ప్రియాంకా గాంధీ తెలుగు ఏం చెప్పారంటే ?

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?