AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
ఏపీ స్థానిక సంస్థల కోటా 12 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ చేసింది. డిసెంబర్ 10న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
![AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ AP Local body quota mlc elections notification released election code came into force AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/ccb6bcb267ef9bed9c94c3fafd138541_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీ స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 26 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అమల్లోకి ఎన్నికల కోడ్
ఏపీలో అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క స్థానం, కృష్ణ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో రెండేసి ఖాళీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. డిసెంబరు 10న ఈ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న కౌంటింగ్ చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా బి–ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా. pic.twitter.com/GAV5M9qCLP
— YSR Congress Party (@YSRCParty) November 16, 2021
వైసీపీ అభ్యర్థులు వీరే..!
ఇప్పటికే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇందుకూరు రాజు (విజయనగరం), వరుదు కళ్యాణి (విశాఖ), వంశీ కృష్ణయాదవ్ (విశాఖ), అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి), మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా), తలశిల రఘురామ్ (కృష్ణా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు), మురుగుడు హనుమంతరావు (గుంటూరు), తూమాటి మాధవరావు (ప్రకాశం), కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), వై శివరామిరెడ్డి (అనంతపురం) పేర్లను వైసీపీ ఖరారు చేసింది.
Also Read: కుప్పం కౌంటింగ్ వీడియో తీసి సమర్పించాలి.. ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం !
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం సీఎం జగన్ కలిశారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందించారు. శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు నుంచి ఇసాక్ బాషా, కడప నుంచి డీసీ గోవిందరెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫాం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్‌కు వెళ్లి నామినేషన్ వేయనున్నారు.
Also Read: ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)