అన్వేషించండి

AP MPTC ZPTC Elections 2021: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం

నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

Key Events
AP MPTC ZPTC Elections 2021 Live Updates; AP Parishad Elections AP MPTC ZPTC Elections 2021: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
ఏపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2021

Background

ఏపీలో వరుసగా మూడోరోజు ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం, సోమవారం పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కారణాలతో గతంలో ఆగిపోయిన చోట్ల, గెలిచిన అభ్యర్థులు మరణించిన స్థానాల్లో మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను రీపోలింగ్ మొదలైంది. 

ఏపీ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసింది. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిసే ఛాన్స్ 

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 954 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నేడు ఏదైనా అవకతవకలు జరిగితే బుధవారం రీ పోలింగ్ నిర్వహడానికి ఏపీ ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది.  గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థుల పేర్లు ప్రటిస్తారు. మొత్తం 7 వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
Also Read: టీడీపీ కంచుకోట బద్దలవుతుంది... దొంగ ఓట్ల సంస్కృతి వైసీపీకి లేదు... చంద్రబాబుకు సజ్జల కౌంటర్ 

మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఏపీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో 4 జెడ్పీటీసీ, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. 3 ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలింగ్ జరుగుతున్న 10 జెడ్పీటీసీ స్థానాలకు 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది బరిలో నిలిచారు. ఈనెల 18న ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేయనున్నారు. 
Also Read: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

17:23 PM (IST)  •  16 Nov 2021

ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉంది. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 14 జడ్పీటీసీ స్థానాలకుగాను నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. 176 ఎంపీటీసీ స్థానలకు గాను 50 ఏకగ్రీవం అయ్యాయి.

14:39 PM (IST)  •  16 Nov 2021

ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

అనంతపురం మురడి పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget