News
News
X

Chandrababu: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్

వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఘాటు విమర్శలు చేశారు.

FOLLOW US: 

ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ప్రజలు తిరగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓటర్లను పట్టించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

ప్రజా వ్యతిరేకత కప్పిపుచ్చుకునేందుకు కుట్రలు

రాష్ట్ర చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిన ప్రభుత్వం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇలాంటి పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగైతే త్వరలోనే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు. దొంగ ఓట్లు వేస్తారని ముందే చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను అపహాస్యం చేసిన ఘటనలు ఇవాళ చూస్తున్నామన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read:  అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చంద్రబాబు ఆరోపించారు. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను ఆదివారం రాత్రే టీడీపీ నేతలు పట్టుకున్నారన్నారు. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పైగా టీడీపీ నేతలను అరెస్టు చేశారన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే ప్రభుత్వాన్నే నిర్వహించుకోవాలని వెళ్లిపోవచ్చన్నారు. వైసీపీ ఎంపీలు, మేయర్లు, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎందుకు ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగ ఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేయడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. 

Also Read: కుప్పంలో దొంగ ఓటర్ల కలకలం ... పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Nov 2021 03:29 PM (IST) Tags: YSRCP AP Latest news kuppam election ap local body elections Tdp Chief chandrababu Fake votes

సంబంధిత కథనాలు

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

AP BJP Fire On YSRCP : కార్పొరేషన్ల కింద ఎంత మంది ఉపాధికి సాయం చేశారు ? లెక్కలు చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ !

AP BJP Fire On YSRCP : కార్పొరేషన్ల కింద ఎంత మంది ఉపాధికి సాయం చేశారు ? లెక్కలు చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ !

Minister Gangula Kamalakar : పచ్చని కుటుంబాన్ని విడదీయడంలో సజ్జల సిద్ధహస్తుడు, ఏపీ మంత్రులకు గంగుల కమలాకర్ కౌంటర్

Minister Gangula Kamalakar : పచ్చని కుటుంబాన్ని విడదీయడంలో సజ్జల సిద్ధహస్తుడు, ఏపీ మంత్రులకు గంగుల కమలాకర్ కౌంటర్

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

టాప్ స్టోరీస్

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు