అన్వేషించండి

Weather Updates: ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిసే ఛాన్స్

AP Rains: తాజా అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

AP Telangana Rain Updates: ఉత్తర అండమాన్ సముద్రం, దాని సమీప ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం నవంబర్ 15న తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజా అల్పపీడన ప్రభావం ఏపీ, తమిళనాడుపై అధికంగా ఉండనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పంటలు నీట మునిగి రైతులు ఇబ్బంది పడుతుండగా, మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది.

దక్షిణ అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. నవంబర్ 18 నాటికి వాయుగుండం ఏపీ తీరానికి చేరే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. 
ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5 .8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి  ఉంది. వాయుగుండం మరో 36 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని మరో నాలుగు రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని వెల్లడించారు. 
Also Read: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధర, వెండి రూ.700 తగ్గుదల

తాజా అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలు, ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం వాసులు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురవనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు తీరంలో వేటకు వెళ్లేందుకు అంత సురక్షితం కాదని చెప్పారు. 

వాయవ్య బంగాళాఖాతం నుంచి వాయుగుండం ఏపీ, తమిళనాడును చేరడంతో ఇది జవాద్ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం ఏపీ, తమిళనాడు, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మూడు, నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.  మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నవంబర్ 18,19 తేదీల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ జె . నివాస్ పేర్కొన్నారు. అధికారులు మరియు సిబ్బంది సెలవులు రద్దు చేసుకొని వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించాలని సూచించారు. 
Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్ప పీడనం, వాయుగుండం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. తమిళనాడు నుంచి ఏపీ, ఒడిశా మీదుగా బెంగాల్‌ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలపిడినా.. దాని ప్రభావంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధ వారాల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read: బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత... కాన్వాయ్ పై రాళ్ల దాడి కారు అద్దాలు ధ్వంసం... బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య బాహాబాహీ 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Embed widget