Dharmana Prasad : బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి !
శ్రీకాకుళం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పనులు చేసిన పార్టీ నేతలకు బిల్లులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు.
![Dharmana Prasad : బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి ! Dharmana Prasad was dissatisfied that the bills were not coming to the YSRCP leaders who were working in the villages Dharmana Prasad : బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/515c081e578e6efbd1e9817d8e86d125_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదని... ప్రతిష్టకు పోయి పనులు చేసిన పార్టీలోని దిగువ స్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టిన ధర్మాన ప్రసాదరావు బిల్లులు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటీసీలు ప్రతిష్టకు పోయి పనులు ప్రారంభించారని కానీ ఇప్పుడు వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు.
Also Read : రోడ్డుపై వెళ్తూ సీఎం జగన్ ఫైర్.. అధికారుల ఉరుకులు, పరుగులు.. అసలేం జరిగిందంటే..
శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు అన్ని జిల్లాల కంటే అడుగున ఉన్నాయనివేల మంది ఇతర ప్రాంతాలకు వలస కార్మికులు గా వెళ్తున్నారన్నారు. వలసలు అరికట్టడానికి ఉపాధి హామీ పథకం తెచ్చారని.. ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో శ్రీకాకుళం జిల్లా వెనకబడుతోందన్నారు. నరేగా పనులు పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి సిమెంట్ సరఫరా సరిగా లేదని ..బైట మార్కెట్ లో సిమెంట్ దరలు మండి పోతున్నాయన్నారు. ఇసుక దొరికే రేటు ఎస్‌ఎస్‌ఆర్ రేటుకు చాలా తేడా ఉండటం వల్ల ప్రభుత్వ లక్ష్యాలను సరిగ్గా చేరుకోలేకపోతున్నామని ధర్మాన వ్యాఖ్యానించారు.
Also Read : ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
ఈ విషయాలన్నింటినీ తాను పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దృష్టికి తీసుకెళ్లానని ఆయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంత మంది అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారని దీని వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆయన చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఇంజనీర్లపై వత్తిడి చేస్తే పనులు కావని లోపాలను సరి చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నానని ధర్మాన అన్నారు. పేద జిల్లా.. సకాలంలో పనులు పూర్తి కాక మరింత నష్ట పోతుందని.. ఊరికనే ఎవరినైనా నిందించడం వల్ల ఉపయోగం లేదుని కార్యకర్తలు పనులు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో పనులు చేసిన వారికి ప్రభుత్వం మారిన తర్వాత బిల్లులు ఇవ్వలేదు. ఈ వివాదం ఇటీవలి వరకూ హైకోర్టులో ఉంది. అందరికీ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే సీనియర్ నేతగా ఉన్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూంటారు. గతంలో జిల్లాల విభజన అంశం వార్తల్లో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు.
Also Read : కుప్పం కౌంటింగ్ వీడియో తీసి సమర్పించాలి.. ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)