News
News
X

Wife Stabs Husband: తన బంధువుల పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య, చివరికి..

తన పుట్టింటి తరపు బంధువుల ఇంట్లోని పెళ్లికి రానన్నాడని భర్తను కత్తితో పొడిచిన భార్య.

FOLLOW US: 

తడు చేసిన తప్పేమీ లేదు.. భార్య పుట్టింటి తరపు బంధువుల ఇంట్లో పెళ్లికి రానని చెప్పాడంతే. ఆ మాటకు అతడి భార్య ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్తతో వాగ్వాదానికి దిగిన ఆమె.. వంటింట్లో గిన్నెలు అతడి పైకి విసిరి కొట్టింది. ఆ తర్వాత నొప్పితో విలవిల్లాడుతున్న భర్త ముందు కత్తితో నిలబడి సర్‌ప్రైజ్ ఇచ్చింది. కసకసా పొడిచి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంది. దీంతో అతడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పుకున్నాడు.

ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో చోటుచేసుకుంది. వాస్తవానికి ఆ రోజు వారిద్దరూ ప్రశాంతంగానే ఉన్నారు. సాయంత్రం భర్తకు టీ పెట్టి ఇచ్చిన భార్య.. తన బంధువుల ఇంట్లో పెళ్లి గురించి చెప్పింది. మనం ఇద్దరం కలిసి ఆ పెళ్లికి వెళ్దాం అని అడిగింది. ‘‘ఆ పెళ్లికి రావడం నాకు కుదరదు. నువ్వు వెళ్లి వచ్చేయ్’’ అని భర్త సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఆమెకు అస్సలు నచ్చలేదు. దీంతో ఆమె అతడి చేతిలో ఉన్న టీ కప్పును గట్టిగా కొట్టింది. అది వెళ్లి అతడి తలను తాకింది. ఆ తర్వాత వంటగదిలోని ఒక్కో పాత్రను అతడిపైకి విసిరింది. అంతటితో సంతృప్తి చెందని ఆమె.. వంటగదిలోని కత్తిని తెచ్చి అతడిని పొడిచేసింది. దీతో అతడు ముకుంద్వాడీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు భారతీయ శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 326, 336 కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. 

గత నెల ఔరంగాబాద్‌‌కు చెందిన ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా హత్య చేయించింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి.. వారి చేతికి మట్టి అంటకుండా భర్తను హత్య చేసేందుకు ఆమె మరో వ్యక్తికి రూ.30 వేలు అడ్వాన్స్ చెల్లించింది. దీంతో నిందితుడు ఆమె భర్త గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 16 Nov 2021 02:34 PM (IST) Tags: aurangabad Wife Stabs Husband Woman Stabes Husband Aurangabad Wife Aurangabad Woman భర్తను పొడిచిన భార్య

సంబంధిత కథనాలు

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఫోకస్ పెట్టండి- అధికారులకు సీఎం జగన్ సూచన

రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఫోకస్ పెట్టండి- అధికారులకు సీఎం జగన్ సూచన

East Godavari : మొక్కని దేవుడు లేడు, ఎక్కని గడపలేదు-చిన్నారి హానీ వైద్యం కోసం తల్లిదండ్రుల అలుపెరగని పోరాటం

East Godavari : మొక్కని దేవుడు లేడు, ఎక్కని గడపలేదు-చిన్నారి హానీ వైద్యం కోసం తల్లిదండ్రుల అలుపెరగని పోరాటం

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!