Delhi Air Pollution: ఎన్‌సీఆర్ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్
ఎన్‌సీఆర్ పరిధిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది సీఏక్యూఎమ్. వాయు కాలుష్యం కారణంగా విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు పేర్కొంది.
దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఏక్యూఎమ్ (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్) పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లోని స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యావ్యవస్థలను మూసివేస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు విద్యాసంస్థలు తెరవకూడదని స్పష్టం చేసింది. విద్యావ్యవస్థ అంతా ఆన్లైన్లో సాగించాలని పేర్కొంది.
కీలక ఆదేశాలు..
- దిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం 11 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ నెల 30 వరకు ఐదు మాత్రమే పనిచేస్తాయని సీఏక్యూఎమ్ వెల్లడించింది.
- ఈ నెల 21 వరకు నిర్మాణాలు, భవనాల కూల్చివేత కార్యకలాపాలు చేయకూడదని దిల్లీ, ఎన్‌సీఆర్ యంత్రాంగానికి తెలిపింది.
- రైల్వే, మెట్రో, బస్సు సర్వీసులు కూడా తమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
- నిత్యావసరాలు మినహా ఇతర వస్తువులు మోసుకెళ్లే ట్రక్కులు, వాహనాలకు దేశ రాజధానిలోకి ప్రవేశం లేదు. ఆదివారం వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.
- హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ ఎన్‌సీఆర్ ప్రాంతం అధికారులతో మంగళవారం జరిగిన సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువరించింది సీఏక్యూఎమ్.
వాయు కాలుష్యం..
వాహన కాలుష్యం, పంట వ్యర్ధాల దహనంతో దిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొంత కాలంగా క్షీణించిన వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్ధాయికి చేరింది. దిల్లీలో వాయు నాణ్యత సూచీ 473గా నమోదైంది. దిల్లీ చుట్టుపక్కల ఉన్న నోయిడాలో ఇది 587గా నమోదు కాగా, గురుగ్రామ్‌లో 557గా నమోదైంది. వాయు నాణ్యత సూచీ సున్నా నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యంగా ఉన్నట్లు, 401 నుంచి 500 ఉంటే పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు.
Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్
Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'
Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి