అన్వేషించండి

India Women Team Recorders : స్మృతి, ప్రతీకా సెంచరీలు - వన్డేల్లో బ్లూమెన్‌ సాధించలేని రికార్టు బద్దలు కొట్టిన భారత మహిళల క్రికెటర్లు

India Women Vs Ireland Women: మూడో వన్డేలో భారత మహిళలు శివాలెత్తారు. స్మృతి, ప్రతికా రావాల్ స్టన్నింగ్ సెంచరీతో ఆకట్టుకో, బౌలర్లు తమ పని పూర్తి చేయడంతో భారత్ భారీ గెలుపు దక్కించుకుంది.

Team India Women's Cricket Recent News: భారత మహిళలు అద్భుతం చేశారు. వన్డే క్రికెట్లో అత్యధిక స్కోరు నమోదు చేశారు. పురుషుల జట్టు కంటే కూడా మహిళలదే ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోరు కావడం విశేషం. బుధవారం రాజకోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 435 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో రెండోవన్డేలో నమోదైన 370 పరుగుల హైయెస్ట్ రికార్డు తెరమరుగైంది. మహిళా  క్రికెట్లో ఇది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. న్యూజిలాండ్ 491 పరుగులతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక, ఓపెనర్ కమ్ కెప్టెన్ స్మృతి మంధాన వేగవంతమైన సెంచరీ (80 బంతుల్లోనే 135, 12 ఫోర్టు, 7 సిక్సర్లు)తో చెలరేగగా, మరో ఓపెనర్ ప్రతీకా రావల్ భారీ సెంచరీ (129 బంతుల్లో 154, 20 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా భారత జట్టుకిదే అత్యంత భారీ విజయం కావడం విశేషం. ప్రతికా రావాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 

రికార్డు సెంచరీ..

ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే స్మృతి దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేయడంతో కేవలం 39 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించింది. ఆ తర్వాత మరో 31 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటింది. దీంతో 70 బంతుల్లో సెంచరీ చేసి, అత్యంత వేగవంతగా సెంచరీ చేసిన భారత మహిళా బ్యాటర్ గా రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు హర్మన్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండేది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి ఓపెనర్లు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి వికెట్ కు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీ పూర్తయ్యాక స్మృతి వెనుదిరిగినా, ప్రతీకా ఏమాత్రం జోరు తగ్గలేదు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి 52 బంతుల్లో ఫఫ్టీ చేసిన ప్రతీకా.. సెంచరీని వంద బంతుల్లో పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జోరు పెంచిన ప్రతీకా.. 27 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకుని ఔటయ్యింది. చివర్లో రిచా ఘోష్ (59) వేగంగా ఆడి ఫిఫ్టీ చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. బౌలర్లలో ప్రెండెర్ గాస్ట్ రెండు వికెట్లతో రాణించింది. 

తిప్పేసిన దీప్తి శర్మ..
భారీ ఛేదనలో ఐర్లాండ్ ను భారత స్పిన్నర్ దీప్తి శర్మ ముప్పు తిప్పలు పెట్టింది. గింగరాలు తిరిగే బంతులు విసురుతూ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి పని పట్టింది. ఆమెతోపాటు తనూజ కన్వర్ కూడా రెండు వికెట్లతో సత్తా చాటింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ సారా ఫోర్బ్స (41), ప్రెండెర్ గాస్ట్(36) మాత్రమే కాస్త పోరాట పటిమ కనబర్చారు. మిగతా వారు ఇలా వచ్చి, అలా వెళ్లడంతో 32వ ఓవర్లోనే ఐర్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరపున మహిళలు అత్యధిక వన్డే స్కోరు నమోదు చేశారు. పురుషుల జట్టు అత్యధిక స్కోరు 418 మాత్రమే కావడం విశేషం. 2011లో వెస్టిండీస్ పై ఈ స్కోరు నమోదు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో 304 పరుగుల భారీ విజయాన్ని దక్కించుకున్న భారత మహిళలు.. గతంలో ఐర్లాండ్ పైనే సాధించిన 249 పరుగుల అత్యధిక పరుగుల భారీ విజయాన్ని సరి చేశారు.

Also Read: Rohit Vs BCCI: రోహిత్ సంచలన నిర్ణయం! - పాక్‌‌లో టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే ఛాన్స్?, డైలమాలో బీసీసీఐ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj:  ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !
ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !
Nara Lokesh: లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan Gokulam Concept | పాడిరైతుల జీవితాలను మార్చే గోకులాలు | ABP DesamKTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP DesamSandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి  సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP DesamMahakumbh 2025 Day 2 | హెలికాఫ్టర్లతో భక్తులపై పూలవర్షం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj:  ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !
ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !
Nara Lokesh: లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
India Women Team Recorders : స్మృతి, ప్రతీకా సెంచరీలు - వన్డేల్లో బ్లూమెన్‌ సాధించలేని రికార్టు బద్దలు కొట్టిన భారత మహిళల క్రికెటర్లు
స్మృతి, ప్రతీకా సెంచరీలు - వన్డేల్లో బ్లూమెన్‌ సాధించలేని రికార్టు బద్దలు కొట్టిన భారత మహిళల క్రికెటర్లు
Sailajanath Latest News: మాజీ మంత్రి శైలజనాథ్ దారి ఎటు..? ఫ్యాన్‌ పార్టీలో చేరడం పక్కా అయిందా ?
మాజీ మంత్రి శైలజనాథ్ దారి ఎటు..? ఫ్యాన్‌ పార్టీలో చేరడం పక్కా అయిందా ?
KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
PM Modi: నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Embed widget