Sailajanath Latest News: మాజీ మంత్రి శైలజనాథ్ దారి ఎటు..? ఫ్యాన్ పార్టీలో చేరడం పక్కా అయిందా ?
singanamala Latest News: సెంటిమెంట్ నియోజకవర్గంలో వైసీపీ మళ్లీ మార్పునకు సిద్దమవుతోందా? చేతులు కాల్చుకున్నాక కూడా ప్రయోగానికి సిద్ధమవుతుందా? మాజీ మంత్రి శైలజానాథ్‌ను రంగంలోకి దింపుతుందా?
Sake Sailajanath and Singanamala Latest News: అనంతపురం జిల్లాలో సింగనమల ఎస్సీ నియో జకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్. గత 30 సంవత్సరాలుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత టిడిపి నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా , ఎంఎల్ఏలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచిన 2024 ఎన్నికల్లో మాత్రం జొన్నలగడ్డ పద్మావతికి వైసిపి టికెట్ దక్కలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరంజానేయులు అనే టిప్పర్ డ్రైవర్‌నీ వైసిపి బరిలోకి దింపింది. దీంతో అక్కడ వైసిపి ఓటమి చవి చూసింది.
ఓటమి అనంతరం సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ పైకి మాత్రమే వీరాంజనేయులు పేరు కానీ నియోజక వర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త వైసీపీ నాయకుడు ఆలూరు సాంబశివ రెడ్డిదే హవా కొనసాగుతుందని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ సెగ్మెంట్‌లో మార్పులకు వైసిపి సిద్ధమౌతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వైసిపి సింగనమల నియోజకవర్గం ఇన్చార్జిగా వీరాంజనేయులు కొనసాగుతున్నా ఆయనకు పెద్దగా ఎక్కడ సపోర్ట్ లేదు. దీంతో ఆయన ఉన్న లేనట్టే అని వైసిపి అధిష్టానం భావిస్తూండడంతో ఇక వేరే వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇదిలా ఉంటే, శైలజానాథ్ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని మరో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజానాథ్ వైసీపీలోకి రానున్నారని టాక్ నడుసోతంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయట.
2019లో పద్మావతి అదే స్థానంలో గెలిచింది. 2024లో పద్మావతిపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిని వెతుక్కోవాలని చంద్రబాబు భావించడంతో చాలా మంది శైలజానాథ్‌ను తలచుకున్నారు. శైలజానాథ్‌ను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. దానికి బదులు చంద్రబాబు శ్రావణిని ఎంపిక చేశారు. వైసీపీ జొన్నలగడ్డ పద్మావతికి బదులు వీరాంజనేయులు అనే టిప్పర్ ట్రక్ డ్రైవర్‌ను ఎంచుకుంది. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇప్పుడు సింగనమలలో వైసీపీకి కొత్త నాయకుడు కావాలి కాబట్టి జగన్ మళ్లీ శైలజానాథ్‌ను పరిశీలిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే సాకే శైలజానాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 2004లో ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు. 2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పని చేశారు. 2014లో శైలజానాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి శమంతకమణి కూతురు యామిని బాలకు టికెట్ కేటాయించారు. దీంతో శైలజనాథ్ కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. మరోసారి ఎంపీగా ఉన్న జెసి దివాకర్ రెడ్డి ఒకరోజు శైలజనాథ్ ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారని గట్టిగా వినపడింది. ఆ టైంలో కూడా శైలజనాథ్‌కు టికెట్ రాలేదు. ఆ స్థానంలో బండారు శ్రావణికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. దీంతో శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు.
వైసీపీలో చేరికపై శైలజానాథ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తొంది. శైలజానాథ్ కుమారుడుకి మరో స్థానం అడుగుతున్నట్టు ప్రచారం. ఈ సారి నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉండడంతో శైలజానాథ్ తన కుమారుడు రిత్విక్‌కి ఒకస్థానం అడుగుతున్నారు అని టాక్ వినపడుతుంది. అందుకు తగ్గట్టు శైలజానాథ్ కుమారుడు కూడా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో ఈసారి శైలజానాథ్ కుమారుడిని రాజకీయ రంగంలోకి దింపుతాడని కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. చూడాలి మరి సెంటిమెంట్ సెగ్మెంట్‌లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో.
Also Read: ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !