Manchu Manoj: ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !
Manchu Family Issue: ఎంబీ యూనివర్శిటీలోకి మంచు మనోజ్ వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలకు పరిష్కారం చూపిస్తానన్నారు.
Manchu Manoj went to MB University: మంచు మనోజ్‌ను ఎంబీ యూనివర్శిటీలోకి రానివ్వకుండా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యారు. మనోజ్ ఎంబీ యూనివర్శిటీలోకి వెళ్లారు. తన అమ్మమ్మ, తాతయ్యల సమాధులకు నివాళులు అర్పించారు. ఆయన లోపలికి వెళ్లకండా పోలీసులు మొదట కట్టడి చేశారు. మనోజ్ హైదరాబాద్ కు వచ్చే ముందే మోహన్ బాబు కోర్టుకు వెళ్లి మనోజ్.. యూనివర్శిటీ ప్రాంగణంలోకి రాకుండా కోర్టు ఉత్తర్వులు తీసుకు వచ్చారు. వాటిని పోలీసులకు ఇవ్వడంతో వారు మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. ఎంబీవర్శిటీకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.
మొదట వెళ్లినప్పుడు గేటు వద్ద అడ్డుకోవడంతో అక్కడి నుంచి నారా వారి పల్లెకు వెళ్లారు. అక్కడ లోకేష్ ఉన్నారు. ఆయనతో సమావేశమయ్యారు సమావేశంలో పూర్తిగా వ్యక్తిగత విషయాలే మాట్లాడుకున్నారని తెలుస్తోంది. తర్వాత మళ్లీ ఎంబీ యూనివర్శిటీ గేటు వద్దకు వచ్చారు. అక్కడ మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లకపోతే లాఠీచార్జ్ చేస్తామని హెచ్చరించారు. అయితే మనోజ్ మాత్రం లోపల తాతయ్య, నానమ్మ సమాధులకు నివాళులు అర్పించడానికి వచ్చానని అలాగే మంచు ప్రసాద్ అనే కజిల్ సమాధి కూడా ఉందని నివాళులు అర్పించిన తర్వాతే వెళ్తానని ఆయన పట్టుబట్టారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నేనంటే ఎందుకు భయం? నేనేమీ గొడవకు రాలేదు. కూర్చుని మాట్లాడుకోవడానికి ఎందుకు భయం అనిఆయన ప్రశ్నించారు. నానన్న, తాతయ్యల సమాధులకు నివాళులు అర్పించడానికి లోపలికి పంపించాలని మంచు మనోజ్ పట్టు బట్టడంంతో కాసేపటికి తర్వాత పోలీసులు స్వయంగా తీసుకెళ్లారు. అక్కడ సమాధులకు నివాళులు అర్పించి బయటకు వచ్చారు. ఇది తన స్వగ్రామం అని.. ఇక్కడంతా తన మనుషులు, స్నేహితులు, బంధువులు ఉన్నారన్నారు. తర్వాత మూడో గేటు నుంచి ఆయనను పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. అక్కడ సమాధులకు నివాళులు అర్పించి బయటకు వచ్చారు.
పోలీసులకు ఇచ్చి మాట ప్రకారం వెళ్లిపోతున్నానని ప్రకటించారు. కొద్ది రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారని నివాళులు అర్పించడానికి వస్తున్నానని తెలిసి ట్రస్టు ట్రాక్టర్‌లో నలభై మంది రౌడీల్ని తెచ్చారన్నారు.తాను గొడవ పెట్టుకోవడానికి రాలేదని లేకపోతే ఈ బౌన్సర్లకు..తాను ఒక్కరిని చాలని హెచ్చరించారు. మనోజ్ మూడో గేటు నుంచి లోపలికి వెళ్లిన సమయంలో వర్శిటీ బౌన్సర్లకు.. మంచు మనోజ్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.