Nara Lokesh: సంక్రాంతి వేడుకల్లో బ్రాహ్మణికి లోకేశ్ అదిరిపోయే గిఫ్ట్ - ఆమె రిప్లై ఇదే!
Andhra News: సంక్రాంతి వేడుకల్లో భాగంగా మంత్రి లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణికి అపురూప కానుకను అందించారు. దీనిపై స్పందించిన ఆమె థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
Nara Lokesh Gift To Nara Brahmani: ఏపీ సీఎం చంద్రబాబు సహా కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన సతీమణి బ్రాహ్మణికి (Nara Brahmani) మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Honoured to gift @brahmaninara a special Mangalagiri saree this Sankranti! The beauty and craftsmanship of our Mangalagiri handlooms are truly unmatched. Let's continue to celebrate and support our skilled handloom weavers who keep this rich heritage alive. #Mangalagiri… pic.twitter.com/zrNZqh0j0C
— Lokesh Nara (@naralokesh) January 14, 2025
బ్రాహ్మణి రిప్లై ఇదే..
Thank you, @naralokesh! This exquisite Mangalagiri saree is truly special, not just for its elegance but for its story of tradition and craftsmanship. It's a privilege to wear the work of our talented weavers. Wishing everyone a very Happy Sankranti filled with joy and… https://t.co/sbvj6sF9Wx
— Brahmani Nara (@brahmaninara) January 14, 2025
లోకేశ్ పోస్టును బ్రాహ్మణి రీపోస్ట్ చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని చెబుతూ లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.