Village Shopping Mall: షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు ఉన్నాసంత సందడే వేరు, నేటికీ ప్రాధాన్యత తగ్గలేదు
Andhra Pradesh News | తరాలు మారిన,పల్లెలు పట్టణాలుగా మారిన నిత్యవసర వస్తువులతోపాటు అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ నేటికీ సంతలకు ఉన్న ప్రాధాన్యతే వేరు.
Srikakulam News | సంతలు నేటికీ సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయనే చెప్పాలి. వారంలో ఒక్కొక్క రోజు జరిగే సంతలో గతంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సరుకులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకునేవారు. అయితే ఈ ప్రాంతంలో చింతాడలో జరిగే సంతకు ప్రాముఖ్యత ఎంతో ఉంది. పురపాలక సంఘం పరిధి చింతాడ గ్రామం పురపాల సంఘం మైదానంలోనిర్వహిస్తూ ఉంటారు. తరతరాలుగా ఇక్కడ సంత సందడిగా జరగుతోంది. ఇక్కడ దొరకని వస్తూ ఉంటూ ఏది ఉండబోదు. కుల వృత్తుల దూరం అవుతున్న నేపథ్యంలో మట్టి కుండలు, వెదురు బుట్టలు, ఇతర సాంప్రదాయ వస్తువులు సంతల్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటికి తోడుగా రైతు వారికి ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు, పశువులు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
సంతలకు వచ్చి వ్యాపార లావాదేవీలు
సంతల్లో వస్త్రాలు కూడా విక్రయాలు చేపడుతూ ఉంటారు. జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒకచోట సంత జరుగుతుంది. ప్రతివారం వందల సంఖ్యలో ప్రజలు సంతలకు వచ్చి వ్యాపార లావాదేవీలు సాగించడంతో పాటు వస్తువులు క్రయవిక్రియలు జరుపుతుంటారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందినప్పటికీ సంతలకు మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. ఇక్కడ సాంప్రదాయ కొనుగోలు నిర్వహిస్తూ ఉంటారు.
సంతకు సంక్రాంతి కళ
సంక్రాంతి వచ్చిందంటే నెల రోజులు ముందు నుండి సంతలో సందడి నెలకొంటుంది. కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ సందడిగా కనిపిస్తుంది. సంక్రాంతికి కుటుంబ సభ్యులు, ఇంటి అల్లుళ్లు రాక సందర్భంగా విందు భోజనాల కోసం మాంసపు ప్రియులు ముఖ్యంగా పొట్టేళ్ళు, కోళ్లు కొనుగోలు చేపడుతుండం సాంప్రదాయంగా వస్తుంది. ఇక కొత్త కుండలు, బెల్లం కూరగాయలు, ఎండుచేపలు సంతలోని కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. సంతలో అన్ని రకాల వస్తువులు ఉంటాయని నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చని సంతలకు వచ్చేవారు చెబుతున్నారు. సంక్రాంతి వేల పొట్టేలకు గిరాకీ బాగా ఉంది. అన్ని గ్రామాల నుండి వీటికి కొనుగోలు చేసినందుకు ఆసక్తి చూపారు.
మారుతున్న టెక్నాలజీ కొత్త కొత్త షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లు ఎన్ని ఉన్నా విలేజ్ లో జరిగే సంతకు మాత్రం ప్రాధాన్యత చాలా ఎక్కువగానే ఉంటుంది అమ్మకు దారులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి సంతలో అమ్ముతూ ఉంటారు కొనుగోలుదారులు కూడా తలన ఊర్లో ఫలానా రోజు ఓసంత ఉంటుంది ఆ సంతకు వెళ్తే అన్ని సరుకులు అక్కడ దొరుకుతాయి అందులోకి సంక్రాంతి టైంలో మరి ఎక్కువగా ఉంటుంది అని ఎక్కడెక్కడ నుంచో కూడా ఆ సంతల కు వెళుతూ ఉంటారు వ్యాపారాలకు కేరాఫ్టర్స్ గా ఉంటుంది పండగ టైంలో అయితే మరి చెప్పనవసరం లేదు వారు బిజీ ఇంత అంతా కాదు.
వీధిలో మాటలు..
నరసమ్మ ఎక్కడికి వెళ్లావు అంటే ఇప్పుడే వదిన సంతకెళ్లి వస్తున్నాను అన్ని బాగున్నాయి అక్కడ పండక్కదా మంచి మంచివి కూడా వచ్చాయి. అంటూ ఎంతో ఆప్యాయంగా చెప్పుకుంటారు సంతకి అంత పేరు ఉంది పేరు కొంతమంది ఇంట్లో పిల్లలు గోల చేసిన ఎక్కడైనా గొడవ జరిగిన ఏంటి ఇల్లంతా సంతలా చేశారు అని అంటారు అదే తనుగా సంత కూడా హడావిడి హడావిడిగా ఉంటుంది ఎక్కడ చూసినా వ్యాపారులు కొనుగోలుదారులు అమ్మకదారులు అందరితో కూడా కలకలాడుతూ ఉంటుంది. ఉత్తరాంధ్రలో సంతలకు అంత పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో పశువులు అమ్మకాలు కొనుగోలు ఎక్కువగా జరుగుతాయి ఏజెన్సీ మైదాన ప్రాంతాలకు వచ్చి వీటివిక్రయాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు.
రాను రాను అంతరించిపోతున్న సంతలు
సంతలకు చాలా ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇప్పుడు ఇవి రాను రాను అంతరించిపోతున్నాయి. ప్రతి గ్రామాల్లో సంతకు అంటూ ఒక ప్లేస్ అనేది ఉంటుంది ఆ ప్లేస్లు ఇప్పుడు నిర్మాణాలు రోడ్డు వైనింగ్స్ లో భాగంగా చాలా వరకు వాటిని అన్యాక్రాంతులుగా గురవుతున్నాయి అయితే మున్సిపల్ ఆఫీసు పరిధిలో ఉండే వాటికి టాక్స్లు కడతారు మిగతా వాటికి టాక్స్లు అనేవి ఉండవు అలా కొన్ని వాటిలో సంతలు అనేవి జరుగుతూ ఉంటాయి. భావితరాల వరకు ఈ సంత అంటే తెలియని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పెద్దలు కూడా చెబుతున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో వీటి ప్రాధాన్యత కొంచెం తగ్గింది ఒకప్పుడు ఉండే ప్రాధాన్యత అయితే ఇప్పుడు లేదు.