Pawan Kalyan Gokulam Concept | పాడిరైతుల జీవితాలను మార్చే గోకులాలు | ABP Desam
ఈరోజు కనుమ పండుగ. అంటే పశువులను పూజించుకునే పండుగ. పాడిని సుఖ సంతోషాలకు సకల సౌభాగ్యాలకు గుర్తుగా భావిస్తారు మన రైతులు. అలాంటిది పాడి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపేలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో శరవేగంగా నిర్మాణమైనవే గోకులాలు. కేవలం మూడంటే మూడు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12వేల 500 గోకులాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించేలా చేశారు పవన్ కళ్యాణ్. కనుమ పండుగకు రైతుల కోసం కూటమి ప్రభుత్వం తరపున భారీ కానుక ఇచ్చారు డిప్యూటీ సీఎం. వర్షం వస్తే పశువులు వానల్లో తడిచిపోతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా పాలదిగుబడిలో తగ్గిపోతోంది. ఇందుకు ఏం చేయాలి. పశువులకంటూ ఓ ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం ఉండాలి. అందులో అన్ని ఫెసిలీటీస్ ఉండాలి డైరీ ఫామ్స్ లో ఎలా ఉంటాయో అచ్చం అలానే. అందుకోసమే ఇలా గోకులాల నిర్మాణం చేపట్టాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఎంత పెద్ద సంఖ్యలో చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 22వేల 525 గోకులాలు కట్టాలి అని. అందులో అన్ని ఫెసిలీటీస్ ఉండాలి. 2ఆవులు, 4 ఆవులు, 6 ఆవుల షెడ్లు అలా సైజ్ బై సైజ్ ఉండాలి అనేది కాన్సెప్ట్. కేవలం ఆవులు, గేదెలె కాదు కాడెద్దులు, కోళ్లు, గొర్రెలు, మేకల కోసం ఇలా గోకులాలు నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం 22వేలు కట్టాలి అనుకుంటే పాడిరైతుల నుంచి ఎంత స్పందన వచ్చిందో తెలుసా ఏకంగా 73వేల అపిక్లేషన్లు వచ్చాయి. సో 3 మంత్స్ లోనే అంటే దసరా కంప్లీట్ అయిన దగ్గర్నుంచి మొదలు పెట్టి ఇప్పుడు సంక్రాంతికి ఈ మూడు నెలల్లోనే పల్లె పండుగ కింద 22వేల అప్లికేషన్లు అప్రూవ్ చేసి 12వేల 500 గోకులాలకు అమౌంట్స్ ఇచ్చేసింది. ఈ నెల చివరికి మిగిలినవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఎందుకంటే. లాస్ట్ ఐదేళ్లలో అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణం అయిన గోకులాలు ఎంతో తెలుసా కేవలం...268. ఐదేళ్లలో 268గోకులాలకు 3నెలల్లో 12వేల 500గోకులాలకు తేడా ఎంతుందో అర్థం అవుతోంది కదా.





















