By: ABP Desam | Updated at : 17 Nov 2021 12:48 PM (IST)
Edited By: Murali Krishna
మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగంపై కోర్టు ప్రశ్నలు
మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ చట్టం ప్రకారం లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతి ఇస్తున్నారో తెలపాలని ప్రభుత్వం, పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
16 మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతి ఇచ్చే ముందు దీన్ని స్పష్టం చేయాలని కోర్టు పేర్కొంది. ఒక వేళ వీటికి అనుమతి ఇస్తే శబ్ద కాలుష్య నియమాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంది.
చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ, జస్టిస్ సచిన్ శంకర్ మగదుమ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
పిటిషన్‌దారులు రాకేశ్ పీ తరఫున న్యాయవాది శ్రీధర్ ప్రభు వాదించారు. శబ్ద కాలుష్య చట్టం ప్రకారం మసీదుల్లో లౌడ్ స్పీకర్లకు అనుమతి ఇవ్వరాదని ఆయన కోర్టుకు తెలిపారు.
రూల్ 5(3) ప్రకారం మసీదులు వంటి ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగించరాదు. ఏదైనా ముఖ్యమైన రోజుల్లో రాత్రి 10- 12 గంటల మధ్యలో వీటిని వినియోగించాలంటే కచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 15 రోజుల కంటే ఎక్కువగా వీటిని వినియోగించకూడదు.
కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆదేశానుసారం లౌడ్ స్పీకర్లు పెట్టడానికి లేదని న్యాయవాది వాదించారు. అయితే ఈ పిటిషన్‌ను మసీదుల తరఫున వాదించిన లాయర్ ఖండించారు. పోలీసుల దగ్గరి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే లౌడ్ స్పీకర్లను వినియోగించినట్లు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అసలు వీటిని వాడలేదన్నారు.
వాదనలు విన్న అనంతరం శబ్ద కాలుష్యాన్ని పెంచేలా వాహనాల సైలెన్సర్లను మార్చుకోవడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. రహదారిపై కాసేపు కూడా ఉండలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో కోర్టుకు తెలపాలని ఆదేశించింది.
అలానే నైట్ క్లబ్‌లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారకులవుతోన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణలో వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
నేను పార్టీ మారడంలేదు-వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ
YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్
Independence Day Wishes : మీ ఫ్రెండ్స్కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Breaking News Live Telugu Updates: వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, కర్నూలు వద్ద ఘటన
Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !
Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం !
Fact Check: బీసీసీఐ ఛైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్గా జే షా!! నిజమేనా?
Yash Raksha Bandan Photos: రాకీ భాయ్ సిస్టర్ ని చూశారా!