TSRTC Bus Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం... ఎంతెంత పెరిగాయంటే..!
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వచ్చిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఛార్జీల మోత మోగనుంది.
![TSRTC Bus Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం... ఎంతెంత పెరిగాయంటే..! Tsrtc bus charges hiked minister puvvada ajay kumar review on charges hike TSRTC Bus Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం... ఎంతెంత పెరిగాయంటే..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/07/e14bd2d78133191f6bf1f18f36846dff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు ఆపై సర్వీసులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read: మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిపై కేసు.. కారణం ఏంటంటే..
నష్టాల నుంచి గట్టెక్కాలంటే
తెలంగాణ ఆర్టీసీ, రవాణా అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఆదివారం రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్పాల్గొన్నారు. ఆర్టీసీపై డీజిల్ భారం భారీగా పెరిగిన కారణంగా ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్ ను కోరారు.సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రం డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించడంతో రోజుకు 65 లక్షల రూపాయలు ఆదా అవుతోందని, దీంతో ఆర్టీసీకి కొంత ఉపశమనం లభించినా నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోందని సమీక్షలో అధికారులు తెలిపారు.
Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..
త్వరలో అధికారిక ప్రకటన
ఛార్జీల పెంపుపై 3, 4 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వాటిపై ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరుణంలో రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోందన్నారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను త్వరలో అధికారికంగా ప్రకటించున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా పూర్తి కావడంతో ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: రూ.100కి చిల్లర ఇవ్వడం మర్చిపోయిన కండక్టర్.. ఒక్క ట్వీట్‌తో ప్రయాణికుడి జేబులోకి డబ్బులు
Also Read: చద్దరులో దూరిన పాము... మూడు నెలల పసికందు మృతి... ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)