By: ABP Desam | Updated at : 07 Nov 2021 09:06 AM (IST)
Edited By: Venkateshk
ఆర్టీసీ బస్సులో సజ్జనార్
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెరిగేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే డీజిల్ ధరలు 30 శాతం పెరగడంతో ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి నల్గొండకు బస్సులో సజ్జనార్ సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు. నల్గొండ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు. వారి సూచలు, సలహాలు స్వీకరించారు. మరో బస్సులో మిర్యాలగూడ బస్ స్టేషన్‌కు వెళ్లారు. ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ట్విటర్ ద్వారా అభిప్రాయాలు తెలపాలని సజ్జనార్ సూచించారు.
ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టిసారించారు. సంస్థాగతంగా ఎన్నో మార్పులను తీసుకొస్తున్నారు. సిబ్బంది పనితీరు, వారి సహకారం, బస్సుల సమయపాలన, ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి సజ్జనార్ సిటీ బస్సులో వెళ్లిన సంగతి తెలిసిందే.
నేడు సమావేశం
ఆర్టీసీపై డీజిల్ ధరల భారం భారీగా పెరిగిన వేళ ఛార్జీలను పెంచాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కోరారు. తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పడంతో.. ఏ మేరకు పెంచాలనే అంశంపై అధికారులు నేడు (నవంబరు 7) సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులతో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష జరపనున్నట్లు సమాచారం.
2019 డిసెంబరులో టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ఆ సమయంలో కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచగా.. ఆ తర్వాత చిల్లర సమస్యలు తలెత్తడంతో మరో 10 పైసలు పెంచాల్సి వచ్చింది. ఆర్టీసీ సంస్థలో మొత్తం 17 రకాల సర్వీసులున్నాయి. గరుడా ప్లస్ ఏసీ, రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, మినీ పల్లె వెలుగు, ఓలేక్ట్రా ఏసీ, మెట్రో లగ్జరీ ఏసీ, మెట్రో డీలక్స్, లో ఫ్లోర్ నాన్ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, సెమీలో ఫ్లోర్, సిటీ ఆర్డీనరీ, సిటీ సబర్బన్, మఫిసిల్, సిటీ ఆర్డీనరి వంటి బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం 30 సీట్ల నుంచి 59 సీట్ల వరకు ఉంటుంది. కిలోమీటరుకు 10 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఛార్జీ ఉంది. తాజా ప్రతిపాదనల సందర్భంగా కిలో మీటరుకు 15 నుంచి 30 పైసలు పెంచాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
ఆర్టీసీ సేవలు వినియోగించుకోండి: సజ్జనార్
నల్లొండలో సజ్జనార్ మాట్లాడుతూ.. పెళ్లిళ్లు, విహార యాత్రలకు, రైతుల ధాన్యం తరలింపునకు ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. బస్సు సౌకర్యం కోసం తనకు ట్విటర్‌లో పోస్ట్ చేస్తే పంపిస్తామని చెప్పారు. అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నామని వెల్లడించారు. కార్గో సేవలు బాగున్నాయని, దాని ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోందని తెలిపారు.
బస్టాండ్‌లో స్టాల్స్ పరిశీలన
బస్టాండ్లలోని స్టాల్స్‌లో అమ్మే వస్తువులను కూడా సజ్జనార్ పరిశీలించారు. ఎమ్మార్పీ ధరలకే వస్తువులను అమ్మాలని, ఒక్క రూపాయి కూడా ప్రయాణికుల నుంచి అదనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరారు. త్వరలోనే ఆర్టీసీని లాభాల బాటపట్టిస్తామన్నారు. అనంతరం ఆయన మిర్యాల గూడకు బస్ డిపోకు వెళ్లారు.
హైదరాబాద్ నుంచి నల్లగొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి. #Nalgonda నల్లగొండ బస్టాండ్‌లో తనిఖీలు చేయడం జరిగింది #TSRTC సౌకర్యాల గురించి అక్కడ ఉన్న ప్రయాణికుల అభిప్రాయాలను స్వయంగా స్వీకరించాను #greenindiachallenge@MPsantoshtrs @TV9Telugu @sakshinews @TelanganaToday @IPRTelangana pic.twitter.com/ZpTWRnL0Pd
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 6, 2021
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..
Also Read: iPhone New Feature: చిత్రలహరిలో సాయితేజ్ తయారు చేసిన ఫీచర్.. త్వరలో వచ్చే కొత్త ఐఫోన్‌లో?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Telangana CM KCR మనవడు ఏ బియ్యం తింటున్నాడో, వారికి అదే బియ్యం అందిస్తున్నాం: కేటీఆర్
MGBS Boy Kidnap Case: ఎంజీబీఎస్‌లో కిడ్నాపైన బాలుడు సేఫ్, కిడ్నాపర్ తెలివిగా చేసిన పనికి పోలీసులు షాక్
Nagarjunasagar Buddhavanam : తెలంగాణలో మరో టూరిస్ట్ డెస్టినేషన్, ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం, మే 14న ప్రారంభోత్సవం
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు