అన్వేషించండి

Telangana New Governor : గవర్నర్ మార్పు వెనుక బీజేపీ పెద్దల పక్కా వ్యూహం - ఇక రాజ్‌భవన్ వర్సెస్ ప్రజాభవన్ తప్పదా ?

Telangana Politics: తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారు. హఠాత్తుగా ఆయనను మార్చడంతో తెలంగాణలో బీజేపీ గేర్ మార్చేందుకేనన్న ప్రచారం జరుగుతోంది.

Will the new Telangana Governor change politics:  తెలంగాణలో గవర్నర్ ను కేంద్రం అనూహ్యంగా మార్చేసింది. బీజేయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎలా వ్యవహరిస్తారో దానికి బిన్నంగా జిష్ముదేవ్ శర్మ వ్యవహరించారు. ప్రభుత్వంతో ఎలాంటి లొల్లి పెట్టుకోలేదు.  నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో ఎలాంటి లొల్లి పెట్టుకోవడం లేదు. రాజకీయంగా విభేదిస్తూనే పాలనా పరంగా కలసి పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నర్ ను మార్చడంతో… తమ పంధాలోకి బీజేపీ వెళ్లనుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణోల గెలిచి తీరాలనుకుంటున్న బీజేపీ.. గవర్నర్ ద్వారా ఇతర పనులు చక్కబెట్టిని పార్టీని దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇప్పటి వరకూ వివాదాస్పదం కాని తెలంగాణ గవర్నర్ 

తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ మార్పు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి, ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించడం వెనుక కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  జిష్ణుదేవ్ వర్మ హయాంలో ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య సంబంధాలు చాలా సజావుగా సాగాయి. గతంలో డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హయాంలో ఉన్న  ఘర్షణ  వాతావరణం జిష్ణుదేవ్ వర్మ వచ్చిన తర్వాత కనిపించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్రంతో పాలనాపరమైన సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. అయితే, తాజా మార్పుతో బీజేపీ తన పంథాను మార్చుకోబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిష్ణుదేవ్ వర్మను కీలకమైన మహారాష్ట్రకు పంపి, సీనియర్ రాజకీయ నేత శివ ప్రతాప్ శుక్లాను ఇక్కడకు తీసుకురావడం వ్యూహాత్మకమే.

బీజేపీ మాస్ వ్యూహం ? 

కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆరితేరిన నేత. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా గమనించిన చరిత్ర ఆయనది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలని చూస్తున్న తరుణంలో, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలోనూ, రాజ్యాంగపరమైన అంశాల్లో గట్టిగా వ్యవహరించడంలోనూ ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడటంతో, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేవలం రాజకీయ పోరాటమే కాకుండా, గవర్నర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదం, యూనివర్సిటీ నియామకాలు,  పాలనాపరమైన విచారణల విషయంలో ఇకపై రాజ్ భవన్ నుంచి గట్టి సమాధానాలు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ - ఇక ప్రత్యక్ష యుద్ధం ? 

ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో  రాజకీయంగా విరోధం - పాలనాపరంగా మైత్రి  అనే సూత్రాన్ని పాటిస్తోంది. కానీ, గవర్నర్ మార్పుతో ఈ వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న  దూకుడు గవర్నర్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే, రేవంత్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు.  బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చాటిచెప్పడానికి, గవర్నర్ మార్పు ఒక మొదటి అడుగుగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై గవర్నర్ జోక్యం పెరిగితే, అది సహజంగానే అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సవాలుగా మారుతుందని అనుకోవచ్చు.  

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget