VC Sajjanar: రూ.100కి చిల్లర ఇవ్వడం మర్చిపోయిన కండక్టర్.. ఒక్క ట్వీట్‌తో ప్రయాణికుడి జేబులోకి డబ్బులు
కండక్టర్లు టిక్కెట్లు కొట్టి మిగతా చిల్లర టికెట్ వెనక రాయడం మామూలు విషయం. ఇలా మర్చిపోయి తమ డబ్బును కోల్పోయే వారు ఎందరో.
బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకున్నాక కండక్టర్ నుంచి ఛేంజ్ తీసుకోవడం మర్చిపోతుండడం తరచూ జరిగే వ్యవహారం. గమ్య స్థానం వచ్చిందని హడావుడిగా దిగిపోవడమో.. లేక కండక్టర్ మర్చిపోవడమో జరుగుతుంటుంది. టికెట్ వెనక చిల్లర డబ్బులు వెనక రాయడం వల్లే ఈ సమస్య అంతా. రూ.100 లేదా రూ.500 నోటు కండక్టరు చేతిలో పెడితే.. మనం అడిగే వరకూ ఆయన తిరిగి ఇవ్వరని కొందరు సరదాగా అంటుంటారు. సిటీ బస్సుల్లో అయితే, ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీలో కండక్టర్‌ను అడిగి డబ్బు తీసుకోవడం ఎక్కువ మంది మర్చిపోతుంటారు. అయితే, తాజాగా ఓ విద్యార్థికి ఈ సమస్యే ఎదురైంది. కానీ, అలాగే వదిలేయకుండా ఆ విద్యార్థి తెలివితో తన డబ్బును వెనక్కి తెప్పించుకున్నాడు. ఒక్క ట్వీట్‌తో ఇది సాధ్యమైంది. ఎలాగంటే..
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..
కండక్టర్లు టిక్కెట్లు కొట్టి మిగతా చిల్లర టికెట్ వెనక రాయడం మామూలు విషయం. ఇలా మర్చిపోయి తమ డబ్బును కోల్పోయే వారు ఎందరో. అయితే ఓ విద్యార్థి ట్వీట్ ద్వారా తన డబ్బు వెనక్కి తెచ్చుకొన్నాడు. ఆ ట్వీట్‌కు ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి డబ్బు పంపేలా చేశారు. సీతాఫల్ మండీకి చెందిన లిక్కిరాజు గురువారం బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటు ఇచ్చాడు. మిగతా డబ్బు దిగేటప్పుడు తీసుకోమంటూ కండక్టర్ టిక్కెట్ వెనక రూ.80 అని రాశారు. గమ్యస్థానం రాగానే ఆ విషయం మర్చిపోయి దిగిపోయిన విద్యార్థికి కండక్టర్ డబ్బు ఇవ్వాల్సిన విషయం గుర్తుకు వచ్చింది. విద్యార్థి జేబులో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో చేసేదేం లేక నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు.
Also Read: పెళ్లింట వరుస విషాదాలు.. తల్లి చనిపోయిందని తెలియగానే ఏఎస్సై హఠాన్మరణం
ఓ ప్రయత్నం చేసి చూద్దామని తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ విద్యార్థి ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని పరిశీలించాలని ఆదేశించారు. శనివారం ఆ ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ.80ని డిపో మేనేజర్ ఫోన్ పే యాప్ ద్వారా పంపించారు. ఎండీ సజ్జనార్, డిపో మేనేజర్ల తక్షణం స్పందించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రాత్రి ఇంట్లో ఒంటరిగా యువకుడు.. బయటికెళ్లిన ఫ్యామిలీ, తిరిగొచ్చి చూసి షాక్
Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి