Hyderabad Crime: రాత్రి ఇంట్లో ఒంటరిగా యువకుడు.. బయటికెళ్లిన ఫ్యామిలీ, తిరిగొచ్చి చూసి షాక్
బోయిన్ పల్లి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన కమల్ రాణా అనే 25 ఏళ్ల వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
![Hyderabad Crime: రాత్రి ఇంట్లో ఒంటరిగా యువకుడు.. బయటికెళ్లిన ఫ్యామిలీ, తిరిగొచ్చి చూసి షాక్ Nepali Man hangs himself in his house in Bowenpally of Hyderabad Hyderabad Crime: రాత్రి ఇంట్లో ఒంటరిగా యువకుడు.. బయటికెళ్లిన ఫ్యామిలీ, తిరిగొచ్చి చూసి షాక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/07/1825f5b1cb4efba5cea58d1d0746e45d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లోని బోయిన్ పల్లి ప్రాంతంలో ఓ యువకుడు ఉన్నట్టుండి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. రాత్రంతా స్నేహితులతో సరదాగా గడిపిన ఆ యువకుడు, ఫోన్‌లో సరదాగా మాట్లాడిన అనంతరం తన ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి సిండికేట్ బ్యాంకు కాలనీలో జరిగింది.
బోయిన్ పల్లి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన కమల్ రాణా అనే 25 ఏళ్ల వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇతను నిరుద్యోగి. కొంతకాలంగా ఓల్డ్ బోయినపల్లి మల్లిఖార్జున కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానిక సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంటి రెండో అంతస్తులో తల్లి సావిత్రి, తమ్ముడు కరణ్ రాణాతో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి వేళ తల్లి సావిత్రి, తమ్ముడు కరణ్ రాణా అతని మామయ్య ఇంటికి వెళ్లారు. రాత్రంతా వారు అక్కడే ఉన్నారు. ఇంట్లో కమల్ రాణా మాత్రమే ఉన్నాడు.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..
శనివారం ఉదయం 8 గంటల సమయంలో వీరు ఇంటికి తిరిగి రాగా.. కమల్ తలుపు తీయలేదు. ఎంత తలుపు తట్టినా, పిలిచినా కమల్ రాణా పలకలేదు. దీనితో అనుమానం వచ్చిన తమ్ముడు పక్కనే ఉన్న కిటికీ పగలగొట్టి, గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించి చూడగా తన అన్న కమల్ రాణా ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతూ కనిపించాడు.
ఒక్కసారిగా షాక్‌కు గురైన తమ్ముడు కరణ్ రాణా ఇంటి తలుపులు తీసి తల్లిని పిలిచాడు. ఇద్దరూ కలిసి కమల్‌ను కిందకు దించి చూశారు. అయితే, అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఇంటి పక్కవారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో అన్ని కోణాల్లో పరిశీలించి ఘటనను ఆత్మహత్యగా నిర్ధరించారు. మృతుడి బంధువు శ్రీకృష్ణ రాణా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Also Read: పెళ్లింట వరుస విషాదాలు.. తల్లి చనిపోయిందని తెలియగానే ఏఎస్సై హఠాన్మరణం
Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)