Top Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ కప్ మ్యాచ్ ఫీవర్ - తన చెల్లెలు కవిత చాలా డైనమిక్ అన్న కేటీఆర్
Top 5 Telugu Headlines Today 19th November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి ఉన్న టాప్ హెడ్ లైన్స్ మీకోసం.
టీమిండియా గెలవాలని నేతల ఆల్ ది బెస్ట్ - ఆలయాల్లో ప్రత్యేక పూజలు
2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా గెలుపు తథ్యమని ఏపీ పర్యటక శాఖా మంత్రి ఆర్కే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా కప్ సాధించబోతుందని, ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడిందని అన్నారు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించి, 27 ఏళ్ళుగా ఉన్న రివెంజ్ ను ఇండియా తీర్చుకోబోతుందని అన్నారు. 160 కోట్ల భారతీయులంతా ఇండియా టీం గెలుపు కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. దాదాపు 12 ఏళ్ళుగా ఇండియా వరల్డ్ కప్ సాధించేందుకు ఎదురు చూస్తుందని, 1983, 2011 తరవాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలువబోతున్నామని అన్నారు. ఇండియా టీంకు మంత్రి రోజా ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తన చెల్లెలు కవిత చాలా డైనమిక్ అంటూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ వినూత్నమైన కార్యక్రమాలు, ప్రణాళికలతో ముందుకు పోతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ యువతతో ఇంటరాక్ట్ అవడం, సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. చిన్నప్పటి నుంచి తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నామని అన్నారు. తన సతీమణి చాలా ఓపిక ఉంటుందని, చెల్లి కవిత చాలా డైనమిక్ అని అని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ - భారీ స్క్రీన్లలో మ్యాచ్ వీక్షిస్తూ సందడి
దేశంలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ నడుస్తోంది. ప్రతి భారతీయుడు మాట్లాడే మాట ప్రపంచకప్ ఫైనల్ (World Cup 2023 Final) గురించే. ఇండియా ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భారత్ ప్రపంచ కప్ సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా (Australia)తో జరిగే పోరులో టీమిండియా (Team India) ట్రోఫీ (World Cup 2023) గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్ సేన (Rohit Sharma)కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. క్రికెట్ అభిమానుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు చేపడతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే ఏర్పాట్లు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సెక్యూరిటీ లేకుండానే ఓల్డ్ సిటీకి వెళ్లిన మంత్రి కేటీఆర్
తెలంగాణ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని నేతలు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వీరిలో మంత్రి కేటీఆర్ తీరే వేరు. మిగతా వారితో పోలిస్తే ఈయన ఎప్పుడు ప్రత్యేకంగానే కనిపిస్తారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియాను ఉపయోగించుకున్న కేటీఆర్, ఈ ఎన్నికల్లో సరికొత్త పంథాను ఎన్నుకున్నారు. మంత్రి అంటే కాన్వాయ్, సెక్యూరిటీ, ప్రొటోకాల్ అంటూ చాలా తంతులు ఉంటాయి. కానీ కేటీఆర్ వాటన్నింటిని వదిలేసి రోడ్లపైకి వస్తున్నారు. గత శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి పాతబస్తీలో సందడి చేశారు. ఆ సమయంలో ఆయన చుట్టూ ఎలాంటి ప్రొటోకాల్ లేదు. సెక్యూరిటీ లేకుండా ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను ఆశ్చర్యపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వీకెండ్స్ లో తిరుమలకు వెళ్తే ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోండిలా.!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడు కొండల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపిస్తున్నారు. అధిక రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్స్, నాలుగు మాడవీధులు, గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. శ్రీనివాసుడి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల పైగా సమయం పడుతుంది. వారాంతరాలు కావడంతో ముఖ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవేంటో తెలియాలంటే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.