అన్వేషించండి

KTR News: నా చెల్లి చాలా డైనమిక్‌, ఆ ధైర్యం ఎవరికీ లేదు - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Women Asks KTR: హైదరాబాద్‌ లోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌ తెలంగాణలో భాగంగా ఉమెన్‌ ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

KTR Comments on Kavitha: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ వినూత్నమైన కార్యక్రమాలు, ప్రణాళికలతో ముందుకు పోతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ యువతతో ఇంటరాక్ట్ అవడం, సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ లోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌ తెలంగాణలో భాగంగా ఉమెన్‌ ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

తెలంగాణలో మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్రగా ఉంటుందని అననారు. ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచిందని అన్నారు. చిన్నప్పటి నుంచి తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నామని అన్నారు. తన సతీమణి చాలా ఓపిక ఉంటుందని, చెల్లి కవిత చాలా డైనమిక్‌ అని అని కొనియాడారు. కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతులు లేరని అన్నారు. తన కుమార్తె చిన్నవయసులోనే చాలా బాగా ఆలోచిస్తోందని చెప్పారు. కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందని కేటీఆర్‌ చెప్పారు. 

తన జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్‌ ఉమెన్‌ లీడర్లను చూశానని.. సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, నిఖత్‌ జరీన్‌ వంటి ఎంతో మంది మహిళలు హైదరాబాద్‌ నుంచి క్రీడల్లో రాణిస్తున్నారని అన్నారు. ఈ మధ్య డీప్‌ ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను రష్మిక అంత ఫేమస్ కాదని సరదాగా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మహిళల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని.. సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. తద్వారా వారు చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారని చెప్పారు. మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటుచేశామని.. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌ల కోసం వీ-హబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌, నందిగామ సహా మొత్తం నాలుగు చోట్ల ఇండస్ట్రియల్‌ పార్కులు పెట్టినట్లుగా చెప్పారు.

హెల్ప్ లైన్ పై ఆలోచిస్తున్నాం - కేటీఆర్

‘‘మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నాం. మహిళలు తమ వివరాలు చెప్పకుండానే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మెంటల్ హెల్త్ సహాయం అందిస్తారు. ప్రతి పక్షాలకు కూడా  మేమే గెలుస్తామని తెలుసు కానీ వాళ్ళు నటిస్తున్నారు. డిసెంబర్ 15 లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక అజెండా మీరే తయారు చేయండి.అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు. రావాలి కూడా. రక్షణ పరంగా ఇప్పటికే షి టీమ్స్ , టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చాం

స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. తెలంగాణ, ఏపీల్లో మహిళలు స్త్రీ నిధి లోన్ లను మహిళలు 99 శాతం చెల్లిస్తున్నారు. ఆ లోన్ తో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. మేం మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్నింటిని పూర్తి చేశాము ఇంకా చేయాల్సిన ఉన్నాయి. మహిళా యూనివర్సిటీ, కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి సేవలు వంటివి  తెచ్చాం. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నాం. సుల్తాన్ పూర్, నందిగామసహా మొతం 4 చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్  ఏర్పాటు చేశాం’’ అని కేటీఆర్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Embed widget