Telangana Home Guards: హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వ న్యూ ఇయర్ గిఫ్ట్.. గౌరవ వేతనం పెంపు
పోలీసు శాఖలో సేవలందిస్తున్న హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూఇయర్ కానుకగా రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది.
తెలంగాణలో హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు 2021, జూన్ నుంచి అమలుల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలు.. సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. వీటికి సంబంధించిన స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హోం గార్డుల గౌరవ వేతనం, వారి సంక్షేమంపై సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసు శాఖలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అర్థం చేసుకున్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో.. హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం హోంగార్డులకు నెలకు 22 వేల రూపాయల గౌరవ వేతనం అందుతోంది. చాలాసార్లు.. తమ గౌరవ వేతనం పెంచాలని.. ప్రభుత్వానికి హోం గార్డులు విన్నవించుకున్నారు. కొన్నేళ్లుగా హోం శాఖలో హోంగార్డులు కీలకంగా వ్యహరిస్తూ విశేష సేవలు చేస్తున్నారు.
Also Read: jagan CBI Court : అందుకే సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు..మెమో సమర్పించిన సీఎం జగన్ !
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి