By: ABP Desam | Updated at : 21 Dec 2021 05:12 PM (IST)
Edited By: Murali Krishna
ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల కోసం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.
The Election Laws (Amendment) Bill, 2021 passed in Rajya Sabha
— ANI (@ANI) December 21, 2021
Yesterday, the Bill was passed in Lok Sabha. pic.twitter.com/ctS2onpIdC
బిల్లులో ఏముంది?
కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ నంబరు కోరేందుకు అధికారులకు ఇది అనుమతిస్తుంది. ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్నవారి నుంచి ఆధార్‌ను సేకరించేందుకూ వీలు కల్పిస్తుంది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటుహక్కు ఉంటే గుర్తించి తొలగించేందుకు ఉపయోగపడుతుంది.
ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 1951ల్లోని సెక్షన్లకు సవరణలు చేశారు. ఎన్నికల సంస్కరణల పథంలో ఈ బిల్లు కీలకంగా మారనుంది. ఆధార్ నంబరు ఇవ్వలేకపోయినంత మాత్రాన ఏ ఒక్కరికీ ఓటుహక్కు నిరాకరించకూడదని తాజా బిల్లులోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలతో వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశమివ్వాలని సూచిస్తున్నాయి.
వ్యక్తిగత గోప్యత..
ఈ బిల్లు చట్టంగా మారితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు ఏడాదిలో నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించేలా మరో ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి