Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 5,326 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 5,326 కరోనా కేసులు నమోదుకాగా 453 మంది మృతి చెందారు. 8,043 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 79,097కు చేరింది.
- యాక్టివ్ కేసులు: 79,097
- మొత్తం రికవరీలు: 3,41,95,060
- మొత్తం మరణాలు: 4,78,007
- మొత్తం వ్యాక్సినేషన్: 1,38,34,78,181
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ వేగంగానే సాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కి చేరింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, దిల్లీలో అత్యధికంగా చెరో 54 కేసులు ఉన్నాయి.
దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న కారణంగా బూస్టర్ డోసులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. త్వరలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచినట్లు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు 20 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కేసు నమోదైంది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కేంద్రం సూచించింది.
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)