YSRCP Attack : మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !
గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాకర్తపై హత్యాయత్నం జరిగింది. మద్యం ధరల విషయంలో వాగ్వాదం జరగడంతో సహనం కోల్పోయిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.
గుంటూరు జిల్లాలో టీడీపీ , వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. టీడీపీ కార్యకర్త వెంకట నారాయణపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్ర గాయాల పాలైన వెంకటనారాయణను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే బోయపాలెం గ్రామంలో మద్యం విషయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో గతంలో సీఎం జగన్ చెప్పినదేంటని.. ఇప్పుడు చేస్తున్నదేంటని.. టీడీపీ కార్యకర్త వెంకట నారాయణ ప్రశ్నించారు.
Also Read: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్
ఈ అంశంపైచర్చ ఉద్రిక్తంగా మారింది. చివరికి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈ ఘటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తప్పుని తప్పు అని చెబితే.. మనుషుల ప్రాణాలు తీసేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సిన పోలీసులు ఏమయ్యారని లోకేష్ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు @ysjagan జన్మదిన వేడుకల్లో చంద్రబాబు గారిని దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే దళితుడైన వెంకటనారాయణ చేసిన నేరంగా మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షసమూకల చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/1QJUgAYFrd
— Lokesh Nara (@naralokesh) December 21, 2021
Also Read: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
అభినవ రక్త పిశాచాలుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు మారారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. క్రూర జంతువుల కంటే దారుణంగా రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు తయారయ్యారన్నారు. పెదనందిపాడులో టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైఎస్ఆర్‌సీపీ నేతల క్రూరత్వానికి సజీవ సాక్ష్యమన్నారు. వెంకటనారాయణకు ఏం జరిగినా అందుకు జగన్‌రెడ్డే బాధ్యత వహించాలని... ప్రతీ ద ానికి బదులు తీర్చుకునే సమయం వస్తుందని హెచ్చరించారు.
Also Read: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?
ఈ ఘటనపై మరో టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. సొంత నియోజకవర్గంలో జరిగిన దానిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంకటనారాయణపై జరిగిన దాడి నిందితులపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు .
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి