Skill Scam : అవినీతికి ఆధారాలున్నాయా..? స్కిల్ స్కాంలో సీఐడీకి హైకోర్టు ప్రశ్న... ఘంటా సుబ్బారావుకు షరతుల బెయిల్ !

స్కిల్ స్కాంలో అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఘంటా సుబ్బారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

FOLLOW US: 

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ -1గా ఉన్న ఘంటా సుబ్బారావుకు హైకోర్టు షరతులతోకూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటలోపు మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది. సీఐడీ విచారణకు హాజరు కావాలంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. 

Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...

ఈ సందర్భంగా దర్యాప్తు అధికారికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.  అవినీతి జరుగుతుందని చెబుతున్నందున.. నిధుల విడుదల, నిర్ణయాలు తీసుకున్న కమిటీలో ఉన్న వారందరినీ కేసులో ఎందుకు చేర్చలేదని ధర్మాసనం సీఐీజని ప్రశ్నించింది.   సుబ్బారావు నిధులు దుర్వినియోగం చేశారని ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. వీటిపై సీఐడీ తరపు న్యాయవాది స్పష్టమైన సమాధానాన్ని హైకోర్టుకు చెప్పలేదు. 

Also Read:  ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ

అలాగే నిధుల విడుదల సహా మొత్తం కార్పొరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేంది మేనేజింగ్ డైరక్టరని.. ఆయన కాకుండా.. ఓ డైరక్టర్‌గా ఉన్న ఘంటా సుబ్బారావు పేరను ఎలా ఏ- 1 చేరుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.  కొంతమందిని కేసులో నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమందిని కావాలని కేసులో ఇరికించారని సుబ్బారావు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 

Also Read: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?

స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ కేసులు పెట్టింది. ఘంటా సుబ్బారావుతోపాటు మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణతో సహా పలువుర్ని నిందితులుగా చేర్చారు. అయితే నిధులు విడుదల చేసింది అప్పటి ఎండీ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి అని అలాగే నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు సీఎంవోలో కీలకంగా ఉన్న షంషేర్ సింగ్ రావత్, అజయ్ జైన్‌లు అని వారిని కాకుండా కేవలం సలహాలకు మాత్రమే పరిమితయ్యేవారిపై కేసులు  పెట్టడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Also Read: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 04:22 PM (IST) Tags: AP CID CID Cases Skill Development Corporation scam bail to Ghanta Subbarao CID aggression in skill scam

సంబంధిత కథనాలు

MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ

MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!

Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం

Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

టాప్ స్టోరీస్

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?