అన్వేషించండి

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

మరికొన్ని రోజుల్లో 2021కి గుడ్ బై చెప్పి కొత్త ఏడాది 2022 స్వాగతం చెప్పేస్తాం. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఇండియాలో టాప్ 11 ప్రదేశాల వివరాలు మీ కోసం.

క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి లాస్ట్ 60 సెకన్లు కౌంట్ చేస్తూ కొత్త సంవత్సరానికి నూతనుత్తేజంతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సరికొత్త ఆశలు, లక్ష్యాలు, భావాలతో కొత్త సంవత్సరాన్ని కొత్త ప్రదేశంలో జరుపుకునేందుకు మీరు సిద్ధమైపోండి. 2022కు స్వాగతం చెప్పేందుకు 11 బెస్ట్ ప్రదేశాల జాబితా మీ కోసం. 

 • గోవా
 • గుల్మార్గ్, జుమ్ము-కశ్మీర్
 • మనాలి, హిమాచల్ ప్రదేశ్
 • ఊటీ, తమిళనాడు
 • వాయనాడ్, కేరళ
 • ఉదయపూర్, రాజస్థాన్
 • మెక్‌లియోడ్‌గంజ్, హిమాచల్ ప్రదేశ్
 • దిల్లీ
 • కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
 • బెంగళూరు, కర్ణాటక
 • పాండిచ్చేరి

1.గోవా

ఇండియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు గోవా చాలా స్పెషల్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ల కోసం అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి. గోవా బీచ్‌లు మీకు స్వాగతం పలుకుతున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణం, విభిన్న సంస్కృతితో కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి గోవా సరైన ఎంపిక అని మీకు అనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు, విభిన్న సంస్కృతి కలగలిసి వేడుక మూడ్ సెట్ చేయడానికి సరిపోతుంది.New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

2. గుల్మార్గ్, జమ్ము-కశ్మీర్

ప్రశాంతమైన గుల్‌మార్గ్ పట్టణంలో కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించండి. ప్రకృతి ఒడిలో నూతన సంవత్సరాన్ని పలకరించాలనుకునే వారు ఈ నగరానికి వస్తే అసాధారణ అనుభూతిని పొందుతారు.
ముఖ్యంగా మంచు, నిశ్శబ్దాన్ని ఇష్టపడే వారికి ఈ పట్టణం చాలా పర్ఫెక్ట్. మీ ప్రియమైన వారిని ఈ అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్లితే వారు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. భారతదేశంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

3. మనాలి, హిమాచల్ ప్రదేశ్
‘వ్యాలీ ఆఫ్ ది గాడ్స్’ ఏడాది పొడవునా పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. అయితే నూతన సంవత్సరం సందర్భంగా మనాలి కూడా చూడదగ్గ ప్రదేశం. ఈ పట్టణం మీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక అందమైన ప్రదేశం. గడ్డకట్టే వాతావరణంతో పాటు భోగి మంటలను ఆస్వాదించే వినోదం నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మనాలిలోని ప్రసిద్ధ ప్రదేశాలలో కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారితో చాలా ఎంజాయ్ చేయవచ్చు. నూతన సంవత్సరం సందర్భంగా తప్పకుండా వీక్షించే ప్రదేశాల్లో మనాలి ఒకటి. ఇక్కడ సందడిగా ఉన్న మార్కెట్లలో షాపింగ్ కూడా చేయవచ్చు. మీరు పార్టీలను ఆస్వాదించాలనుకుంటే, ఓల్డ్ మనాలిని సందర్శించవచ్చు. నూతన సంవత్సర వేడుకలలో కొత్త రుచులను ఆస్వాదించవచ్చు. పాత మనాలిలో అద్భుతమైన కేఫ్‌లకు మీకు స్వాగతం చెబుతాయి. నూతన సంవత్సర వేడుకలకు రుచికరమైన వంటకాలతో, కొత్త ప్రదేశాలతో మనాలి స్వాగతం చెబుతోంది. మనాలిలో నూతన సంవత్సర వేడుకల్లో హిప్పీ సంస్కృతిని ఆస్వాదించవచ్చు. మీరు సోలాంగ్ వ్యాలీ, కుఫ్రి వంటి పరిసర ప్రాంతాలకు చూసేందుకు రోడ్ ట్రిప్‌ ప్లాన్ చేసుకోవచ్చు. మంచుతో నిండిన రోడ్లపై సమయం గడపడం మిమల్ని మరింత ఉత్తేజపరుస్తుంది. New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

4. ఊటీ, తమిళనాడు
నూతన సంవత్సరాన్ని కూల్ గా స్వాగతించాలనుకుంటున్నారా అయితే ఊటీ చాలా చక్కటి ప్రదేశం. ప్రశాంతతతో పాటు ప్రకృతి అందాలకు ఊటీ మేటి. ఊటీలో సాయంత్రాలు.. సంగీతం, కలర్ ఫుల్ పార్టీలతో ఆనందంగా సాగుతోంది. నిస్సందేహంగా దక్షిణ భారతదేశంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఊటీ ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.  నూతన సంవత్సర పర్యటనల కోసం ఊటీ ఉత్తమ ఆలోచన కావచ్చు. కుటుంబ-స్నేహపూర్వక ఈవెంట్‌ల నుంచి సంతోషకరమైన పార్టీల వరకు, డీజే పార్టీల నుంచి వేరైటీ ఫుడ్ ఐటమ్స్ వరకు మరెన్నో 2022 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఉన్నాయి. ఊటీలో నూతన సంవత్సర ఈవెంట్‌లు, పార్టీలను నిర్వహించే అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

5. వాయనాడ్, కేరళ
వాయనాడ్ లేదా గ్రీన్ ప్యారడైజ్.. భారతదేశంలోని ఉత్తమ నూతన సంవత్సర గమ్యస్థానాలలో ఒకటి. ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఈ పరిపూర్ణ ప్రదేశం అద్భుతమైనది. కొత్త అనుభూతిని పొందాలనుకునే వారు తప్పనిసరిగా సందర్శించాల్సి ప్రదేశం. పచ్చని సుగంధ తోటల చుట్టూ తిరుగుతూ సుందరమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. జలపాతాల సింఫొనీ, ఆకుపచ్చ తోటలు మీకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తాయి. నగరంలోని ఏదైనా బహిరంగ పచ్చికభూముల వద్ద టెంట్ వేసుకుని సీనరీస్ ఎంజాయ్ చేయవచ్చు.  వాయనాడ్‌లో అనేక రిసార్ట్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రశాంతమైన టైం గడపవచ్చు. New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

6. ఉదయపూర్, రాజస్థాన్
ఉదయపూర్‌లోని ‘సిటీ ఆఫ్ లేక్స్’ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు చక్కటి ప్రదేశం. మీ ప్రియమైన వారితో ఆనందించడానికి ఇది ఉత్తమ ప్రదేశం. మీరు ఇక్కడ రాజభవనాలలో స్మారక చిహ్నాలను చూడవచ్చు. స్థానిక మార్కెట్లలో తిరుగుతూ నగర సందర్శనకు ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి గొప్ప పార్టీలతో రాచరిక జీవనశైలిలో స్థానిక రుచులను ఎంజాయ్ చేయవచ్చు. ఉదయపూర్‌లో మీ కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారితో కలిసి నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి అనేక రిసార్ట్‌లు క్లబ్‌లు ఉన్నాయి. 

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

7. మెక్లీడ్‌గంజ్, హిమాచల్ ప్రదేశ్

ఈ హిల్ స్టేషన్ అద్భుతమైన సందర్శనా స్థలాల్లో ఒకటి. క్లాసిక్ కేఫ్‌లు, ప్రత్యేకమైన టిబెటన్ సావనీర్‌లు ఇక్కడ ఉంటాయి. ధర్మశాల సమీపంలోని మెక్‌లియోడ్‌గంజ్‌లో నూతన సంవత్సర వేడుకలు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ప్రశాంతమైన పరిసరాల కోసం వెతుకుతున్నట్లయితే, విభిన్న సంస్కృతిని అనుభవించాలనుకుంటే, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి అత్యంత అందమైన గమ్యస్థానాలలో మెక్లీడ్‌గంజ్ ఒకటి. మీరు మీ ట్రిప్ లిస్ట్‌లో చేర్చుకోవడానికి ధర్మశాల సమీపంలోని స్థలాలను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ మీరు పార్టీ వైబ్‌లను ఆస్వాదించవచ్చు. మెక్లీడ్‌గంజ్‌లో అనేక దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. మీరు ప్రశాంతమైన నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకుంటే ఈ దేవాలయాలలో కొన్నింటిని సందర్శించండి. భాగ్సునాథ్ ఆలయం మీకు చిన్న ట్రెక్‌ను అందించే ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

8. దిల్లీ

దేశం రాజధాని దిల్లీలో రిఫ్రెష్‌మెంట్, మెలోడీ, లైట్లు, డ్యాన్స్ మధ్య నూతన సంవత్సరాన్ని ఆనందించండి. ఇక్కడ నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి అనేక ప్లేసెస్ ఉన్నాయి. ఖరీదైన పార్టీలతో, మీరు అద్భుతమైన లాంజ్‌లు, దిల్లీలోని ప్రత్యేకమైన నైట్‌క్లబ్‌లలో పార్టీలను ఆస్వాదించవచ్చు. మీరు ఇక్కడి నైట్ క్లబ్ లలో దేశంలోని అత్యుత్తమ డీజేలు ప్లే చేసే పాటలను ఆస్వాదించవచ్చు. హౌజ్ ఖాస్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్ లను సందర్శిస్తూ రాత్రి జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మీరు థీమ్ పార్టీలలో భాగం కావాలనుకుంటే, ఈ సమయంలో లొకేషన్‌లు ఎక్కువగా రద్దీగా ఉంటాయి. కాబట్టి మీ పార్టీ టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోండి.  భారతదేశంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి దిల్లీ ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

9. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
దేశంలో అత్యంత డైనమిక్ నగరాల్లో ఒకటి కోల్‌కతా. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. అన్ని వయసుల వారు నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించవచ్చు. నగరంలోని నైట్‌క్లబ్‌లు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అన్ని టెన్షన్లను విడిచిపెట్టి కోల్‌కతాలో తిరిగేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. గ్రూవింగ్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ..రుచికరమైన వంటకాలను టేస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకా మీ ప్రణాళికలను రూపొందించుకోకపోతే నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి సిటీ ఆఫ్ జాయ్ సరైన గమ్యస్థానం. 

Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి

10. బెంగళూరు, కర్ణాటక
దేశంలోని ఐటీ హబ్‌లో రాబోయే నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటి. పచ్చని ఉద్యానవనాలు, పబ్బులు, కేఫ్‌లు, వినోద కేంద్రాలు, విలాసవంతమైన బహిరంగ ప్రదేశాలతో.. బెంగుళూరులో మీ సెలబ్రేటరీ మూడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ నగరంలో అద్భుతమైన హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ మీరు మీ కొత్త సంవత్సరాన్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. డీజేల సంగీతంతో పార్టీ వేదికలు దుమ్మురేపుతాయి. మీరు బెంగుళూరులోని స్మాలీస్ రెస్టో కేఫ్, నాగార్జున, ది హమ్మింగ్ ట్రీ వంటి బెస్ట్ రెస్టారెంట్‌లలో చక్కటి భోజనాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

11. పాండిచ్చేరి
పాండిచ్చేరిలో నూతన సంవత్సర వేడుకలలో మునుపెన్నడూ లేని విధంగా ఆస్వాదించవచ్చు. రిసార్ట్‌లు, పబ్బులు, బీచ్‌లు, క్లబ్‌ల వరకు అనేక రకాల పార్టీలు మీకు స్వాగతం చెబుతాయి. పాండిచ్చేరి నైట్ లైఫ్ పార్టీలు యువతను ఉర్రూతలూగిస్తాయి. పాండిచ్చేరిలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి పోర్ట్ బీచ్ పార్టీ, బీచ్ బాష్ NYE , కాటమరాన్ బీచ్ ఫెస్టివల్ సిద్ధంగా ఉన్నాయి.  ప్యారడైజ్ బీచ్, ప్రొమెనేడ్ బీచ్ పాండిచ్చేరి, అశోక్ బీచ్ రిసార్ట్, LB2 లాంజ్, పబ్ జిప్పర్, ఉమామి కిచెన్, క్రాస్కీస్ రెస్ట్రాపబ్, జింగీ సలై, సీగల్స్ బీచ్ రిసార్ట్, అరోమా గార్డెన్స్, ఆరోవిల్, అతిథి TGI గ్రాండ్, చిన వీరంపాట్న్, చిన్న వీరంపాటిన్, ఐలాండ్ పార్టీ 2022 నూతన సంవత్సరాన్ని స్టైల్‌గా స్వాగతించడానికి గుడ్ డెస్టినేషన్. 

New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...

Read also:  చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP NEWS: బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
school holidays in Telangana: మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
Yami Gautam: ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
Media vs Politics: మీడియా వ‌ర్సెస్ పాలిటిక్స్‌, న‌లిగిపోతున్న నాలుగో స్తంభం!
మీడియా వ‌ర్సెస్ పాలిటిక్స్‌, న‌లిగిపోతున్న నాలుగో స్తంభం!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Akaay Kohli: విరుష్క జోడీ తమ అబ్బాయికి పెట్టిన ఈ పేరు వెనుక చాలా అర్థం ఉంది..!TDP Janasena Seats Sharing : సీట్ల షేరింగ్ లో టీడీపీ-జనసేన కు మధ్య ఏం జరుగుతోంది.? | ABP DesamYS Sharmila Son Haldi: రాజారెడ్డి,ప్రియ హల్దీ వేడుక వీడియో షేర్ చేసిన వైఎస్ షర్మిలVirat Kohli Anushka Sharma Baby Boy : విరాట్ కొహ్లీ ఇంట్లో సంబరం..వారసుడొచ్చాడు.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP NEWS: బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
school holidays in Telangana: మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
Yami Gautam: ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
Media vs Politics: మీడియా వ‌ర్సెస్ పాలిటిక్స్‌, న‌లిగిపోతున్న నాలుగో స్తంభం!
మీడియా వ‌ర్సెస్ పాలిటిక్స్‌, న‌లిగిపోతున్న నాలుగో స్తంభం!
High Court Liberality: తెలంగాణ హైకోర్టుకు చిన్నారుల లేఖ- పార్కు స్థలం కబ్జాపై విచారణకు ఆదేశం
తెలంగాణ హైకోర్టుకు చిన్నారుల లేఖ- పార్కు స్థలం కబ్జాపై విచారణకు ఆదేశం
Mahesh Babu: ‘ఫోన్ పే’లో మహేశ్ బాబు - మీరు డబ్బులేస్తే, ఇది వినొచ్చు!
‘ఫోన్ పే’లో మహేశ్ బాబు - మీరు డబ్బులేస్తే, ఇది వినొచ్చు!
AP Elections 2024: తరుముకొస్తోంది ఎన్నిక.. కూటమిలో ఏదీ కదలిక.!
తరుముకొస్తోంది ఎన్నిక.. కూటమిలో ఏదీ కదలిక.!
Minister Seethakka: మేడారంలో గిరిజన కళాకారులతో కలిసి గుస్సాడి నృత్యం చేసిన మంత్రి సీతక్క
Minister Seethakka: మేడారంలో గిరిజన కళాకారులతో కలిసి గుస్సాడి నృత్యం చేసిన మంత్రి సీతక్క
Embed widget