(Source: Poll of Polls)
Electoral Reform Bill: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?
లోక్‌సభలో ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధాన బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. సభ్యుల ఆందోళనల నడుమే బిల్లుకు ఆమోదం లభించింది.
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల కోసం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
'The Election Laws (Amendment) Bill, 2021' passed in Lok Sabha.
— ANI (@ANI) December 20, 2021
The Bill seeks to allow electoral registration officers to seek the Aadhaar number of people who want to register as voters "for the purpose of establishing the identity".
House adjourned till tomorrow, 21st Dec. pic.twitter.com/QjGDjGhl4j
విపక్షాల నిరసన..
ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుప్రీం కోర్టు తీర్పును ఈ బిల్లను ఉల్లంఘిస్తోందని విమర్శించాయి. అంతేగాక పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని విపక్ష సభ్యులు ఆరోపించారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది సభ. అయితే ఆందోళనలో చర్చ చేపట్టే అవకాశం రాలేదు. అనంతరం సభను డిసెంబర్ 21వరకు వాయిదా వేశారు.
బిల్లులో ఏముంది?
- ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం.
- ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం.
- ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేయడం.
- పాన్- ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తారు.
వ్యక్తిగత గోప్యత..
ఈ బిల్లు చట్టంగా మారితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం కచ్చితంగా చేసుకోవాలా లేక ప్రజలే స్వచ్ఛందందా అనుసంధానించుకునేలా ప్రక్రియ చేపడతారా అనే దానిపై స్పష్టత లేదు.
ఇంకా..
వీటితో పాటు ఏడాదిలో నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించేలా మరో ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.
Also Read: Aishwarya Rai Summoned: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి