Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 1.5 రోజుల నుంచి 3 రోజుల్లోనే డబుల్ అవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
![Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్! Omicron variant cases doubling time between 1.5-3 days in high community transmission areas- WHO Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/18/19d08dd009b41d3c87e229b024d50557_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గడగడలాడిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి గుర్తుచేసింది. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై మరో షాకింగ్ విషయం చెప్పింది డబ్ల్యూహెచ్ఓ.
స్పీడ్ పెంచింది..
సామూహిక వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు 1.5 నుంచి 3 రోజుల్లో రెట్టింపవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్ బారిన పడిన 89 దేశాల్లో వైరస్ వ్యాప్తి తీరుకు సంబంధించిన నివేదికల ఆధారంగా ఈ మేరకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో డెల్టా కేసులను ఒమిక్రాన్ దాటేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఎందుకు?
ఒమిక్రాన్.. వైరస్ రోగ నిరోధక శక్తిని అధిగమిస్తుండటంతోనే వ్యాప్తి వేగంగా జరుతున్నదా అన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ముప్పు గురించి ఇప్పటి వరకు తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మరింత డేటా ఆధారంగానే ఈ వేరియంట్ ముప్పును పూర్తిగా అంచనా వేయగలమని అభిప్రాయపడింది. అయితే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలపై మరోసారి భారం పడవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ రోగులతో ఆసుపత్రులు నిండుతున్నట్లు పేర్కొంది.
భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో 143 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి.
Also Read: Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం
Also Read: Tamil Nadu CM Stalin: స్టాలిన్ మరోనిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు మెుదటి 48 గంటల వైద్యం ఉచితం
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,081 మందికి కరోనా.. 143కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)