Marriage: పెళ్లిలో రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వరుడు.. వీపు విమానం మోత మోగించిన వధువు కుటుంబం
వరుడికి అప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన ఉంగరం ఇచ్చారు. అయినా పెళ్లిలోనే రూ. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ వరుడిని బాంకెట్ హాల్‌లో కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో డిసెంబర్ 12, 2021 నాటిది. ప్రస్తుతం ఈ వీడియో సర్వాత్ర చర్చనీయాంశమైంది.
ఘజియాబాద్ లో ముజమ్మిల్ హుస్సేన్ అనే వ్యక్తికి... ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి ముందే వరుడు రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే పెళ్లి జరిగాక విందు చేస్తున్న సమయంలో వరుడితోపాటు అతడి తండ్రి మహమూద్ హుస్సేన్ రూ. 10 లక్షల నగదును డిమాండ్ చేశారు. లేకపోతే పెళ్లి తంతు ముందుకు జరిగేది లేదని తెగేసి చెప్పారు.
వరుడు రూ.10 లక్షల నగదు డిమాండ్ చేయగా అప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన డైమండ్ రింగ్ ఇచ్చామని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అంతకుముందే ముజమ్మిల్ కు పెళ్లిళ్లు చేసుకున్నట్టు వధువు కుటుంబానికి తెలిసింది. గతంలో పెళ్లైన విషయాన్ని దాచి.. మరోవైపు డబ్బులు డిమాండ్ చేయడంపై.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికొడుకును తీవ్రంగా కొట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి వచ్చారు. వివాదాన్ని ఎలాగోలా సద్దుమణిగేలా చేశారు.
వరుడి కుటుంబ సభ్యులపై వధువు కుటుంబం ఫిర్యాదు చేసంది. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 420 మరియు వరకట్న నిషేధ చట్టం, 1961 కింద వరుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read: KTR Standup Comedy : ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్ స్కామ్ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి