Tamil Nadu CM Stalin: స్టాలిన్ మరోనిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు మెుదటి 48 గంటల వైద్యం ఉచితం
తమిళనాడు సీఎం స్టాలిన్ సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. తమిళనాడులో రహదారులపై, రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారి ప్రాణాలను వెంటనే రక్షించాలన్న ఉద్దేశంతో.. ప్రాణాలను కాపాడుదాం (ఇన్నుయిర్ కాప్పోమ్) అనే పేరుతో మరో కొత్త పథకాన్ని చెంగల్‌పట్టు జిల్లా మేల్ మరువత్తూర్ లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో సీఎం స్టాలిన్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం ఎందుకోసమంటే.. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని రక్షించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడతారు. ఇన్నుయిర్ కాప్పోమ్ నమైకాక్కుమ్48 పథకంలో భాగంగా.. ప్రమాదం జరిగిన వ్యక్తి.. ప్రాణాన్ని కాపాడేందుకు మెుదటి 48 గంటల్లో అయ్యే అవసరమైన వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. బాధితులకు 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేటు ఆస్పత్రులు సహా 610 ఆస్పత్రులను ప్రభుత్వం సెలక్ట్ చేసింది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, ప్రధాన రహదారుల్లోని ప్రైవేటు ఆస్పత్రులు కూడా ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నా క్షతగాత్రులను వెంటనే చేర్పించి కాపాడేందుకు వీలుగా ప్రణాళిక చేశారు. ఎక్కడివారైనా.. తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైతే.. పథకంలో భాగంగా మెుదటి 48 గంటల పాటు ఉచిత వైద్యం ప్రభుత్వం అందిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ మెుదటి 48 గంటలు ముఖ్యమని.. అందుకోసమే.. పథకాన్ని ప్రారంభించినట్టు స్టాలిన్ అన్నారు.
Also Read: Pakistan: కరాచీలోని ప్రైవేట్ బ్యాంక్ లో భారీ పేలుడు... 12 మంది మృతి, మరో 11 మందికి గాయాలు
Also Read: 12 ఏళ్ల క్రితం తప్పిపోయి.. పాక్ జైల్లో తేలాడు.. భార్యకు మరో పెళ్లైంది.. ఇంకో ట్విస్టు ఏంటంటే
Also Read: KTR Standup Comedy : ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
Also Read: Akilesh IT Raids : యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి