By: ABP Desam | Updated at : 18 Dec 2021 07:37 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరాచీలో పేలుడు
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. సీవేజ్ కెనాల్ లో భారీ పేలుడు సంబంధించింది. ఈ పేలుడులో కాల్వపై నిర్మిస్తున్న ఒక ప్రైవేట్ బ్యాంక్ పూర్తిగా ధ్వంసం అయింది. కరాచీలో షెర్షా ప్రాంతంలో మురుగునీటి కాలువలో పేలుడికి పైనున్న బ్యాంకు కూలిపోయింది. బ్యాంకు లోపల ఉన్న ఖాతాదారులు, సిబ్బందిలో 12 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక తెలిపింది. ఈ పేలుడు కారణంగా పక్కనే ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ కూడా దెబ్బతింది.
Inna lillah e wa inna elaih e raajioon!
— Sadia A 🇵🇰 (@DrSadiaA) December 18, 2021
Unfortunate sad incident! A blast happened in a private bank in Karachi taking 11 innocent lives! The bank was built illegally on a water drainage. Gas was filled in the pipes & led to this blast! pic.twitter.com/bSQeOQQaul #KarachiBlast
మురుగునీటి లైన్ లో పేలుడు
కరాచీ అడ్మినిస్ట్రేటర్ ముర్తాజా వహాబ్ మాట్లాడుతూ.. పేలుడుకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామన్నారు. కరాచీ పేలుడులో 11 మంది గాయపడగా, 10 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన ధ్రువీకరించారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందని, గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వహాబ్ ట్వీట్ చేశారు. ఈ పేలుడులో 12 మంది మరణించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. మురుగునీరు, గ్యాస్ లైన్లు ఉన్న ఇరుకైన వాటర్ కోర్సులో బ్యాంక్ భవనం నిర్మించారని అధికారులు తెలిపారు. మురుగునీటి లైన్‌లో గ్యాస్ పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించిందా లేదా గ్యాస్ పైప్‌లైన్‌తో ఏదైనా సమస్య తలెత్తిందా లేదా పేలుడు పదార్థాన్ని అక్కడ ఉంచారా అని నిర్ధారించడం కష్టమని పోలీసులు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో మరో పేలుడు
"గ్యాస్ పేలుడా మరేదైనా కారణమా అనేది మాకు తెలియదు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక పేలుడుకు గల కారణాన్ని గుర్తించగలం" అని దక్షిణ ప్రాంత పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ) షర్జీల్ ఖరాల్ అన్నారు. రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భవనం శిథిలాల కింద చాలా మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శనివారం కావడంతో బ్యాంకులో కేవలం తొమ్మిది మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. పేలుడు జరిగినప్పుడు భవనం కింద ఉన్న వాటర్ కోర్సులో కొందరు వ్యక్తులు పడిపోవడం చూశానని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వైర్లు గ్యాస్ లైన్‌ను ఢీకొనడంతో రెండో పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఆదేశించారు.
Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్ స్కామ్ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!
Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి