By: ABP Desam | Updated at : 21 Dec 2021 04:38 PM (IST)
టీ బీజేపీ నేతలతో షా భేటీ
తెలంగాణ ప్రభుత్వంపై రాజీ పడకుండా పోరాటం చేయాలని టీఎస్ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ నేతలు.. బీజేపీని కార్నర్ చేసి రాజకీయం చేస్తూండటం.. అదే పనిగా ఢిల్లీకి వచ్చి అపాయింట్‌మెంట్‌లు ఇవ్వకుండా అవమానిస్తున్నారని ప్రకటనలు చేస్తూండటం వంటి అంశాలపై చర్చించేందుకు టీఎస్ బీజేపీ ముఖ్య నేతల్ని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది.
Also Read: బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలో ఎందుకు లిఖిత పూర్వకంగా చెప్పారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి , విజయశాంతి వంటి నేతలంతా అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ఆందోళనలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో పీయూష్ గోయల్ వివరించారు.
Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్
ఈ సమావేశానికి ముందే గోయల్ ప్రెస్‌మీట్ పెట్టి... తెలంగాణ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చిందని... ఇతర బియ్యం ఎంత ఇచ్చినా తీసుకుంటామని ప్రకటించారు. ధాన్యం విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అమిత్ షాతో జరిగన భేటీలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో భారీ బియ్యం స్కాం జరిగిందని గోయల్ కొన్ని వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read: KTR: కేటీఆర్ - కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్.. ఆ రోడ్లు తెరిపించాలని కొనసాగుతున్న నిరసనలు
ఈ సందర్భంలో అమిత్ షా... టీఆర్ఎస్ పై పోరాటానికి మీరు చేయగలిగినదంతా చేయండి..ప్రభుత్వ పరంగా ఏంచేయాలో తాము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై పోరాడాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో తమనే రైతుల దృష్టిలో దోషిగా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించడానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగాతెలుస్తోంది.
Also Read: Hyderabad: లేకలేక పెళ్లయింది.. మెట్టింట్లో భార్యకు గ్రాండ్ వెల్‌కం.. కాసేపటికే అందరికీ భారీ షాక్
KNRUHS: కటాఫ్ స్కోర్ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్
MANAGE: మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు, వివరాలు ఇలా
Vijayashanthi: సొంత పార్టీ నేతలపైనే రాములమ్మ ఆగ్రహం, తలనొప్పిగా అసంతృప్తులు!
Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్
Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం - బీఆర్ఎస్ లాగా హామీలు ఇచ్చి మోసం చేయం: శ్రీధర్ బాబు
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>