Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్
తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉన్న వేళ ఈ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రధాని మోదీ పని చేస్తున్నారని పీయూష్ గోయల్ అన్నారు.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని గత ఏడాది క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. ఇప్పటిదాకా చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలి. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలయింది. రా రైస్ (సాధారణ బియ్యం బాయిల్డ్ రైస్ కాకుండా) ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’
‘‘సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం అయింది. బాయిల్డ్ రైస్‌ను నిర్దేశిత పరిమాణంలో అదనంగా కూడా తీసుకుంటామని అంగీకరించాం. అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఈ అవకాశాన్ని కేవలం దేశంలో తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. కానీ, ముందస్తుగా చేసుకున్న ఆ ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వా్ల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. అందుకోసం నాలుగు సార్లు గడువు కూడా పొడిగించాం. దేశంలో బాయిల్డ్ రైస్‌ను జనం వాడరు కాబట్టే మేం దానిపై పరిమితులు విధించాం’’ అని పీయూష్ గోయల్ తెలిపారు.
Also Read: Jagityal: జగిత్యాలలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’.. పోలీసులతోనే ఓవరాక్షన్.. చివరికి అడ్డంగా బుక్
Also Read: Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?
Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..