KTR: కేటీఆర్ - కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్.. ఆ రోడ్లు తెరిపించాలని కొనసాగుతున్న నిరసనలు
కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య ట్వీట్ యుద్ధం నడుస్తోంది. తాజాగా స్థానికులు కూడా మూసేసిన గేట్ల వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసనలు కూడా చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో మూసేసిన రోడ్ల వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్యలో ట్వీట్‌ల యుద్ధం నడుస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తొలుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్‌లో చట్టవిరుద్ధంగా రోడ్లను మూసివేసి లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక మిలిటరీ అథారిటీస్ (ఎల్‌ఎంఏ) నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా...
అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మీ మంత్రికి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన లేనట్లుంది.. కంటోన్మెంట్‌లో మొత్తం 21 రోడ్లు మూసేస్తే, మీ మంత్రి కేవలం రెండే మూసేసినట్లు చెబుతున్నారని రాజ్‌నాథ్‌ను ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేశారు.
అయితే, దీనిపై కిషన్ రెడ్డి వివరాలు కోరగా.. ‘కిషన్‌రెడ్డి గారూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో చట్టవిరుద్ధంగా మూసేసిన రోడ్ల వివరాలు అడిగారు కదా... ఇదిగో జాబితా.. ఆ రోడ్లను తక్షణమే తెరిచేలా లోకల్ మిలటరీ అథారిటీస్‌కు ఆదేశాలివ్వండి. లక్షలాది మంది స్థానికులకు ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సోమవారం ట్విటర్‌లో సమాధానం చెప్పారు.
Dear Sri @kishanreddybjp Garu,
— KTR (@KTRTRS) December 20, 2021
You wanted me to furnish the list of roads closed illegally within the Secunderabad Cantonment area
Here it is 👇 Hope you can do justice and ensure LMA reopens all roads immediately for the benefit of Millions of our citizens pic.twitter.com/3DR1quDNwn
అది వీలుకాని పక్షంలో కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేయండి అంటూ సూచించారు. ‘ఒకవేళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు స్థానికులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే, కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేయండి’ అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. మొత్తంగా కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య ట్వీట్ యుద్ధం నడుస్తోంది.
తాజాగా స్థానికులు కూడా మూసేసిన గేట్ల వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసనలు కూడా చేస్తున్నారు. రోడ్లు తెరిస్తే తమకు ఎంతో దూరం కలిసి వస్తుందని కోరుతున్నారు. గేట్లు మూయడం వల్ల తాము చుట్టూ తిరిగి ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తుందని అంటున్నారు.
These images have been clicked just now few minutes back @kishanreddybjp garu,
— krishanKTRS (@krishanKTRS) December 20, 2021
can send you pictures of more closed roads too.
But why cant we we do something Sir,
Why don't u personally come and count the Closed Roads and see the sufferings of residents of Cantonment ?@KTRTRS pic.twitter.com/QvGcfuXyl9
Also Read: Bride Escape: లేకలేక పెళ్లయింది.. మెట్టింటికి వచ్చిన భార్య, వెంటనే మొత్తం దోచుకుపోయింది!
Also Read: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...
Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?