Kishan Reddy: బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలో ఎందుకు లిఖిత పూర్వకంగా చెప్పారు
వరి ధాన్యం సేకరణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ధాన్యం సేకరణలో ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు.
మూడు రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు.. ఎంపీ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికంటే ముందుగానే.. తెలంగాణ బీజేపీ నేతలు.. సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రమంత్రులకు వివరించారు. పియూష్ గోయల్‌తో పాటు కిషన్ రెడ్డిలు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రబీ సీజన్‌కు సంబంధించి 44.75 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనడానికి అగ్రిమెంట్ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కాకుండా.. రా రైస్ కూడా 17.78 లక్షల మెట్రిక్ టన్నుల రైస్‌కు ఒప్పందం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 4.64 మెట్రిక్ టన్నుల రా రైస్‌ను ఎఫ్‌సీఐకి అందించిందన్నారు. బాయిల్డ్, రా రైస్ కలిపి.. 27.39 లక్షల మెట్రిక్ టన్నుల రైస్‌ను ఇంకా.. ఇవ్వాల్సి ఉందన్నారు.
ఒప్పందాల ప్రకారం ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుందని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి లిఖిత పూర్వకంగా ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్టాక్ ఉన్నా కేంద్రం రైస్‌ను కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయాల్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉన్న వేళ ఈ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రధాని మోదీ పని చేస్తున్నారని పీయూష్ గోయల్ అన్నారు.
‘‘సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం అయింది. బాయిల్డ్ రైస్‌ను నిర్దేశిత పరిమాణంలో అదనంగా కూడా తీసుకుంటామని అంగీకరించాం. అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఈ అవకాశాన్ని కేవలం దేశంలో తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. కానీ, ముందస్తుగా చేసుకున్న ఆ ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వా్ల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. అందుకోసం నాలుగు సార్లు గడువు కూడా పొడిగించాం. దేశంలో బాయిల్డ్ రైస్‌ను జనం వాడరు కాబట్టే మేం దానిపై పరిమితులు విధించాం’’ అని పీయూష్ గోయల్ తెలిపారు.
Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్
Also Read: Hyderabad: లేకలేక పెళ్లయింది.. మెట్టింట్లో భార్యకు గ్రాండ్ వెల్‌కం.. కాసేపటికే అందరికీ భారీ షాక్
Also Read: KTR: కేటీఆర్ - కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్.. ఆ రోడ్లు తెరిపించాలని కొనసాగుతున్న నిరసనలు