TS Liquor Shops : హైదరాబాద్ కన్నా ఏపీ సరిహద్దు మద్యం దుకాణాలకే డిమాండ్ ! ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో తెలుసా..?
ఏపీలో దొరకని బ్రాండెడ్ మద్యం దొరకడం.. చాలా తక్కువ రేటుకే లభిస్తూండటంతో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో అమ్మకాలు ఎక్కువ. వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు.
తెలంగాణ సర్కార్ ఖజానాకు లిక్కర్ కిక్ ఎక్కుతోంది. కొత్తగా దుకాణాలకు వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలా వేలం పాటలో పాడుకునేందుకు ధరఖాస్తులు వెల్లువెత్తాయి. కేవలం దరఖాస్తుల ద్వారానే తెలంగాణ సర్కార్‌కు రూ. 1357 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 2620 దుకాణాలకు 67,849 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క దరఖాస్తు ఫీజు రూ. రెండు లక్షలు. డ్రాలో దుకాణం లైసెన్స్ దక్కినా దక్కకపోయినా ఇవి తిరిగి ఇవ్వరు ప్రభుత్వానికే లభిస్తుంది. ఈ అప్లికేషన్ ఫీజుల వల్లనే రూ. 1357 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి దక్కింది.
Also Read : ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు నిర్ణయం ఉపసంహరణ... ఎన్నికల నియమావళే కారణమా...!
ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాల కోసం పోటీ ఎక్కువగా ఉంది. అత్యధికంగా ఖమ్మం ఎక్సైజ్ డివిజన్‌లో టెండర్లు వేశారు. ఖమ్మంలో 122 షాపులకు ఏకంగా 6212 అప్లికేషన్లు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి ఖమ్మంలో 51 మంది పోటీ పడుతున్నారు. నిజానికి హైదరాబాద్ పరిధిలో పోటీ ఎక్కువగా ఉండాలి. కానీ హైదరాబాద్ కన్నా సరిహద్దు ప్రాంతాల్లోనే మద్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరకదు.. పైగా అత్యధిక ధరలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది సరిహద్దు మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేస్తూంటారు. అందుకే అక్కడ పోటీ ఎక్కువగా ఉంది.
Also Read: ఈటెల రాజేందర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!
హైదరాబాద్ కన్నా ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లోని తెలంగాణ మద్యం దుకాణాలు ఎక్కువ అమ్మకాలు నమోదు చేస్తున్నాయి. కర్నూలుకు సరిహద్దుల్లో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి అనే గ్రామంలో మద్యం దుకాణం అమ్మకాల్లో నంబర్-1 స్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో రెండు సంవత్సరాల్లోనే రూ.64 కోట్ల మద్యాన్ని విక్రయించింది. అలంపూర్పరిధిగా అక్కడే ఉన్న మరో వైన్ షాపు రూ.58 కోట్ల మద్యాన్ని అమ్మింది. ఈ లెక్కన ఉండవెల్లి గ్రామంలోనే రూ.122 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
Also Read : ‘మోదీ రాక్షసుడు.. ఆ చట్టాలు అప్పుడే రద్దు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది’: రేవంత్ రెడ్డి
సాధారణంగా రాష్ట్రంలోని మండల కేంద్రాల్లోని దుకాణాల్లో సగటున రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దుకాణాల్లో సగటున రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు మద్యం అమ్ముడువుతుంది. కానీ ఈ రికార్డులు సరిహద్దుల దుకాణాలు బద్దలు కొడుతున్నాయి. అంటే ఏపీ ఆదాయం తెలంగాణకు వస్తుందన్నమాట.
Also Read : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ మధుసూదనా చారి .. వెంటనే రాజ్ భవన్ ఆమోదం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి