MLC Chari : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ మధుసూదనా చారి .. వెంటనే రాజ్ భవన్ ఆమోదం !
మాజీ స్పీకర్ మధుసూదనా చారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం లభించింది. ప్రభుత్వం పంపిన సిఫార్సును తమిళశై ఆమోదించారు.
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రభుత్వం సిఫార్సు చేసింది. వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో మధుసూదనా చారి ఎమ్మెల్సీ అయ్యారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసింది. అయితే ఆయనపై కేసులు ఉండటం, సామాజిక సేవ రంగాల్లో ఉన్న వారికే గవర్నర్ కోటా కింద చాన్స్ ఇస్తారన్న అభిప్రాయంతో గవర్నర్ తమిళిసై ఫైల్‌పై సంతకం చేయలేదు. ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయలేదు. ఈ లోపు హుజురాబాద్ ఉపఎన్నికలు ముగిశాయి.
Also Read : అధికారం కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పదే.. సాగు చట్టాల రద్దుపై కేటీఆర్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డికి చాన్స్ ఇచ్చారు. దీంతో గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో గవర్నర్ కోటా తరపున మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ తొలి శాసనసభలో స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారికి కేసీఆర్ అవకాశం కల్పించారు. కేబినెట్ సమావేశం లేకపోయినా మంత్రులందరి సంతకాలు సేకరించి గవర్నర్‌కు పంపారు.
Also Read : ధాన్యం కొనాలంటూ తడిసిన ధాన్యంతో రైతుల ధర్నా... ఓ అన్నదాత ఆత్మహత్య యత్నం
వెంటనే గవర్నర్ ఆమోదించారు. మధుసూదనా చారి గత ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మధుసూదనాచారికి టిక్కెట్ దక్కడం కష్టమే. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ బండా ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కేసీఆర్ కుమార్తె కవితకు కేటాయించే అవకాశం ఉండటంతో గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీగా అవకాశం పొందారు.
Also Read: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ
కేసీఆర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. జిల్లా సమీకరణాలను చూసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో .. వీలైనంత వరకూ రెబల్స్ లేకుండా చూసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : కేంద్రం చెప్పేసింది ! ఇక రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచిస్తారా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి