By: ABP Desam | Updated at : 19 Nov 2021 10:58 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేయడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆ వెంటనే ఆయన ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల శక్తి ఎప్పుడూ అధికారంలో ఉన్నవారి పవర్ కంటే అధికమని కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ డిమాండ్‌ల కోసం నిరంతం శ్రమించి భారత రైతులు తమకు కావాల్సినదాన్ని విజయవంతంగా సాధించారని అన్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కూడా జోడించారు.
‘‘ప్రజల పవర్ ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నవారి శక్తి కంటే గొప్పది. తమ డిమాండ్‌ల కోసం నిరంతం శ్రమించి భారత రైతులు తమకు కావాల్సినదాన్ని విజయవంతంగా సాధించారు. జై జవాన్ జై కిసాన్’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
“The power of people is always greater than the people in power”
Proved once again by the Indian farmers who got what they demanded by their relentless agitation 👍
Jai Kisan Jai Jawan#FarmLawsRepealed#TRSwithFarmers#FarmersProtest — KTR (@KTRTRS) November 19, 2021
3 కొత్త చట్టాలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు మోదీ. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ.
‘‘రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదింతలు పెంచాం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చే చట్టాలే.. కానీ ఓ వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తోన్న రైతులు ఇక ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నాను.’’ అని ప్రధాని మోదీ మాట్లాడారు.
విజయం సాధించిన రైతులు
సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఫలించలేదు. అయితే.. ఇన్ని రోజుల తర్వాత నేడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గింది కేంద్రం. దాదాపు 8 నెలలుగా రైతుల ఉద్యమం సాగింది. నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు- అన్నాదాతలకు మధ్య చాలా సార్లు చర్చ జరిగింది.
Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్
Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత
TS BJP Coverts : ఆకర్ష్ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ బండి సంజయ్ - మైండ్ గేమ్ లో ఎవరిది పైచేయి ?
Weather Latest Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం ఎఫెక్ట్! రేపు ఈ ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు
ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Taraka Ratna Health Update | Chandrababu: తారకరత్న ఆరోగ్య అప్డేట్ ఇచ్చిన చంద్రబాబు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Tirumala Update: తిరుమలకు వెళ్తున్నారా? ఈ టోకెన్లు లేకపోతే దర్శనానికి 20 గంటలకు పైగా టైం
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!