Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
LIVE
Background
ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. తాము తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేస్తామని కీలక ప్రకటన చేశారు. గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు మోదీ. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ.
[quote author= ప్రధాని నరేంద్ర మోదీ]రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ బడ్జెట్ను ఐదింతలు పెంచాం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చే చట్టాలే.. కానీ ఓ వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తోన్న రైతులు ఇక ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నాను. [/quote]
రైతుల విజయం..
సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఫలించలేదు. అయితే.. ఇన్ని రోజుల తర్వాత నేడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గింది కేంద్రం.
దాదాపు 8 నెలలుగా రైతుల ఉద్యమం సాగింది. నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు- అన్నాదాతలకు మధ్య చాలా సార్లు చర్చ జరిగింది.
ప్రభుత్వం తెచ్చిన ఎలాంటి ప్రతిపాదనను రైతులు అంగీకరించలేదు. బేషరతుగా చట్టాలను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎండ, వాన, చలి ఇలా ఏది లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగించారు. ఈ మొక్కవోని దీక్షే వారికి ఈ విజయం తెచ్చిపెట్టింది.
ఒకానొక సమయంలో చలికి ఎముకలు కొరుకుతోన్న చలించకక వారు చూపించిన తెగువకు యావత్ దేశం కంటనీరు పెట్టుకుంది. అయిన ఇప్పటివరకు సర్కార్‌కు కనికరం కలగలేదు. అయితే ఎట్టకేలకు సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని మోదీ నేడు ప్రకటించారు.