Tirupati Rains: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ లో ని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. అక్కడి పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ మేరకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. అక్కడ కురుస్తున్న వర్షాలు, ప్రభావంపై అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో నీటిమట్టాలను గమనిస్తూ.. తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

సహాయక శిబిరాల్లో వసతులు ఉండేలా చూడాలి. శిబిరాల్లో ఉన్నవారికి రూ.వెయ్యి తక్షణ సహాయం ఇవ్వాలి. తిరుపతిలో సహాయక చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలి. సిబ్బదిని అందుబాటులో ఉంచుకోవాలి. వైద్యారోగ్యసిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు నిధులు ఉన్నాయి. నిధుల కోసం రాజీపడాల్సిన అవసరం లేదు.

                                                                                               - వైస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు జిల్లా కలెక్టర్ తో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ కార్యాచరణ సిద్ధం చేసి బాధితులకు అండగా ఉండాలన్నారు. సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సీఎం చెప్పారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన .చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.  

సహాయక చర్యలపై ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలన్నారు. నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్న అడగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిచ సాయంతోసహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఉదయం కూడా మాట్లాడిన సీఎం

భారీవర్షాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం కూడా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్షించారు. తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

Also Read: Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం.. దంచికొడుతున్న వానలు

Also Read: Rains: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం

Also Read: In Pics: తిరుమలలో వర్ష బీభత్సం... కాల్వలను తలిపిస్తున్న మాఢ వీధులు

Also Read: Balka Suman: ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై దుష్ప్రచారం... నలుగురు వ్యక్తులు అరెస్టు.. పరారీలో ముగ్గురు యువకులు

Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌

Also Read: Kurup Real Story: 38 ఏళ్ల మిస్టరీ.. పోలీసులకు చుక్కలు.. ఎవరీ కురుప్? అసలు ఉన్నాడా? పోయాడా?

Also Read: Hyderabad Crime: అమ్మానాన్నలు చేసేది పాడుపనులు.. కుమార్తెకు సైతం ట్రైనింగ్.. చివరికి అడ్డంగా దొరికిపోయి!

Tags: Weather Updates CM Jagan Review floods in tirupati cm jagan on rains Chittoor rains nellore rains Tirumala rains tirupati floods

సంబంధిత కథనాలు

Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

Meters For MOtors Politics : వ్యవసాయ మోటర్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లా ? ఏపీ సర్కార్ చెబుతున్నట్లుగా మంచిదా ?

Meters For MOtors Politics : వ్యవసాయ మోటర్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లా ? ఏపీ సర్కార్ చెబుతున్నట్లుగా మంచిదా ?

Road Accident : రోడ్డు పక్క గుంతలో బోల్తా పడిన కారు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Road Accident : రోడ్డు పక్క గుంతలో బోల్తా పడిన కారు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Kuppam Hotel Attack : భోజనం లేదన్నారని హోటల్ పై దాడి, వీడియో షేర్ చేసిన చంద్రబాబు

Kuppam Hotel Attack : భోజనం లేదన్నారని హోటల్ పై దాడి, వీడియో షేర్ చేసిన చంద్రబాబు

YSRCP Rajyasabha : బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్‌సీపీ ఆఫర్ ఇచ్చిందా ?

YSRCP Rajyasabha :  బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్‌సీపీ ఆఫర్ ఇచ్చిందా ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు