(Source: ECI/ABP News/ABP Majha)
Weather Update: అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వానలు.. చెన్నై-పుదుచ్చేరి మధ్య శుక్రవారం తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయానికి చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంద వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. శుక్రవారం ఉదయానికి చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి నగరం జలమయం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైల్వే అండర్ బ్రడ్జ్‌లు వర్షపు నీటితో మునిగాయి. తిరుపతి నగరంలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్దనున్న అండర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండింది.
విమానాలు వెనక్కి..
చిత్తూరు జిల్లాలో ఎక్కువగా వానలు పడుతున్నాయి. ఈ కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్ కు వస్తున్నాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. తిరుమలలోనూ వర్ష బీభత్సం సృష్టిస్తోంది. తిరుమాఢ విధులు జలమయం అయ్యాయి. మరోవైపు కనుమ దారి ప్రమాదకరంగామారింది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.
కడప, తిరుపతి రహదారిపై నిలిచిపొయిన వాహనాల రాకపొకలు నిలిచిపోయాయి. రైల్వేకోడూరు మండలం బాలపల్లి ,కుక్కలదొడ్డి మధ్య జాతీయ రహదారిపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహంలో వాహనాలు ఇరుక్కు్న్నాయి. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమదారిలో హరిణి వద్ద రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసి వేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా.. సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలోనూ వాయుగుండం కారణంగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి