News
News
X

Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌

హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఎగ్జామ్స్‌లో కాపీ కొడుతుందనే అనుమానంతో బాలిక దుస్తులు విప్పించి స్కూల్ యాజమాన్యంగా దారుణంగా వ్యవహరించింది.

FOLLOW US: 
 

హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల దళిత బాలికపై ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ అసభ్యంగా ప్రవర్తించింది. పరీక్షలో కాపీ కొడుతుందనే నెపంతో బాలిక బట్టలు విప్పించి తనిఖీ చేయించింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

ఏం జరిగింది?

2021, సెప్టెంబర్ 23న ఆర్షిఫీషియల్ ఇంటిలిజెన్స్ పరీక్ష రాస్తోంది ఆ బాలిక. అయితే రెండు సార్లు వాష్ రూమ్‌కు వెళ్లేసరికి బాలిక కాపీ కొడుతుందని భావించింది ఇన్విజిలేటర్. దాంతో ఆ బాలిక తన వద్ద సెల్‌ ఫోన్ దాచిందనే అనుమానంతో ఆమెను స్టాఫ్ రూమ్‌కు పిలిపించింది. బాలిక వద్ద సెల్‌ఫోన్ ఉందేమో చెక్ చేయమని ఆయాకు తెలిపింది. దీంతో బాలికను ఆయా వాష్‌రూమ్‌కు తీసుకువెళ్లి దారుణంగా ప్రవర్తించింది. బాలిక దుస్తులు మొత్తం విప్పించి.. అంతటితో ఆగకుండా చెకింగ్ నెపంతో లో దుస్తులు కూడా విప్పించింది. అయితే బాలిక వద్ద మొబైల్ లేదని తెలిసి క్లాస్ రూమ్‌కు పంపించారు

ఫిర్యాదు..

News Reels

ఈ ఘటనతో భయపడిన బాలిక.. విషయాన్ని తన తల్లికి చెప్పుకొని ఏడ్చింది. అయితే ఈ ఆరోపణలను స్కూల్ యాజమాన్యం ఖండించింది. తమ వాదనను పోలీసులకు ఇప్పటికే చెప్పినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే బాలిక తల్లి.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఐపీసీ సెక్షన్లు 354, 504, 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 3(2)(Va) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్‌ ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ (ఎస్‌సీపీసీఆర్), బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి కూడా బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. 

ప్రస్తుతం 10వ తరగతి చదువుతోన్న బాలిక.. ఈ ఘటన తర్వాత పరీక్షలపై శ్రద్ధ చూపించలేకపోతుందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి ఉన్నట్టుండి ఏడుస్తుందన్నారు. ఆమె పాఠశాల టీచర్ చేసిన పనికి సిగ్గుతో బాధపడుతుందని బాలిక తల్లి మీడియాకు వెల్లడించారు.

కుల వివక్ష..

అయితే బాధిత బాలికపై సదరు టీచర్ పలుమార్లు ఇలానే ప్రవర్తించినట్లు బాలిక తల్లి చెబుతున్నారు. ఒక్కోసారి బాలిక వేషధారణ సహా చాలా చిన్న విషయాలకు ఆ టీచర్ తన కూతురిపై వివక్ష చూపేదని ఆమె ఆరోపించారు. ఇదంతా తాము నిమ్న వర్గాలకు చెందినవారం కావడం వల్లే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

" ఆ టీచర్.. మా కూతురితో ప్రవర్తించిన తీరు చూస్తే ఇది కావాలనే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మేము తక్కువ కులానికి చెందిన వాళ్లం కావడం వల్లే ఆమె ఇలా ప్రవర్తించింది. ఇంతకుముందు జరిగిన ఘటనలను మేం సీరియస్‌గా తీసుకోలేదు. అదే ఇక్కడ మేం చేసిన తప్పు. అప్పుడే మేం ఫిర్యాదు చేసి ఉంటే నా కూతురు ఇప్పుడు ఇలా జీవితాంతం దాని గురించి బాధపడేది కాదు. ఈ పాఠశాల పిల్లలందర్నీ సమానంగా చూడటం లేదు. ఇలాంటి ఘటనల వల్ల పిల్లలు జీవితాంతం బాధపడతారు.                                     "
-బాలిక తల్లి

యాజమాన్యం పట్టించుకోలేదు..

ఈ ఘటన జరిగిన మరుసటి రోజే స్కూల్ ప్రిన్సిపల్‌ను కలిశారు బాలిక తల్లి. అయితే అలాంటి ఘటనే జరగలేదని.. బాలిక అబద్ధం చెబుతోందని ప్రిన్సిపల్ ఆరోపించారు. పైగా తన కూతురు పరీక్షలో కాపీ కొడుతుండగా గత ఏడాది పట్టుకున్నట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.

పోలీసులు ఏమన్నారంటే?

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలోని సీసీటీవీ సహా మరిన్ని ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటన వాష్‌రూమ్‌లో జరగడం వల్ల ఎలాంటి సీసీటీవీ ఆధారాలు దొరికే అవకాశం లేదు.

ఈ ఘటనపై బాధపడతోన్న బాలిక అక్టోబర్ 20 నుంచి పాఠశాల తెరిచినప్పటికీ వెళ్లడం లేదు. తోటి పిల్లలు, టీచర్లు ఎవరైనా మళ్లీ ఈ ఘటన గురించి ఏడిపిస్తారమోనని బాలిక భయపడుతోంది.

Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్‌ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్

Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్

Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'

Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం

Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...

Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...

Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Nov 2021 05:24 PM (IST) Tags: Hyderabad crime news Hyderabad crime Dalit girl in school made to strip by teacher harassed

సంబంధిత కథనాలు

B.Com Admissions: కామ్‌గా 'బీకామ్‌'లో చేరిపోయారు, 'బీటెక్‌'ను మించి ప్రవేశాలు!

B.Com Admissions: కామ్‌గా 'బీకామ్‌'లో చేరిపోయారు, 'బీటెక్‌'ను మించి ప్రవేశాలు!

Breaking News Live Telugu Updates: వంశీరామ్‌ బిల్డర్స్ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై ఐటీ రైడ్స్

Breaking News Live Telugu Updates: వంశీరామ్‌ బిల్డర్స్ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై ఐటీ రైడ్స్

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక- ఈనెల 8 నుంచి వర్షాలు!

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక-  ఈనెల 8 నుంచి వర్షాలు!

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో పోరాటం- ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో పోరాటం- ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

టాప్ స్టోరీస్

జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్

జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!