Nizamabad: ధాన్యం కొనాలంటూ తడిసిన ధాన్యంతో jరైతుల ధర్నా... ఓ అన్నదాత ఆత్మహత్య యత్నం
కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనాలంటూ జాతీయ రహదారి 44పై ఆందోళన చేపట్టారు అన్నదాతలు. తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఈ ఖరీప్‌లో భారీగా వరిధాన్యం దిగుబడి వచ్చింది. అయితే దాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు రైతులు నిరసన చేపట్టారు. గతేడాది కంటే చాలా తక్కువ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారని అన్నదాతలు విమర్శిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు.. మరోవైపు అకాల వర్షంతో తడిసిపోతున్న వరి రైతులను టెన్షన్ పెడుతోంది. ఏం చేయాలో అన్నదాతకు పాలుపోవడం లేదు. ధాన్యం కొనే వారు లేక వరుణుడి నుంచి కాపాడుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు రైతన్నలు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Also Read: నిజామాబాద్ జిల్లాలో అరుదైన శిల్పం.. గుర్తించిన పరిశోధకులు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట వద్ద రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధర్నా చేశారు. క్రిమి సంహార మందులను పట్టుకుని ఆందోళన చేశారు. ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా అక్కడున్న రైతులు అడ్డుకున్నారు. 25 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దే ఉంచి ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఐకేపీ, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న ఓ రైతు వరి ధాన్యం కుప్పపైనే ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అకాల వర్గాలు రైతులను మరింత కుంగదీయటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు కుంగిపోతున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ
కర్షకుల ఆందోళనతో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సూమారు గంట పాటు రైతులు రోడ్దపైనే బైఠాయించారు. ఘటన స్థలం వద్దకు కామారెడ్డి డిఎస్పి సోమనాథం వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. కేంద్ర,,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు మాటలు పేల్చుకుంటున్నారు తప్ప తమ ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు అన్నదాతలు.
Also Read: నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా ఖరారు కాని పార్టీల అభ్యర్థులు