X

Justice NV Ramana: అప్పట్లో సినిమా రంగానిది బాధ్యతాయుతమైన పాత్ర.. నేటి తరం వాళ్లు సమీక్షించుకోవాలి

ఘంటసాల పాటలు మన జీవితాలతో పెనవేసుకున్నాయని.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 

FOLLOW US: 

హైదరాబాద్ రవీంద్ర భారతీలో ఘంటసాల శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఘంటసాల పురస్కారాన్ని గాయని.. పి.సుశిలకు ప్రదానం చేశారు. ఘంటసాల పురస్కారం తన చేతుల మీదగా అందజేయడం అదృష్టంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.

భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషా ఔన్నత్యం కోసం మద్దతివ్వట్లేదని వ్యాఖ్యానించారు.  ఘంటసాల పాటలు జీవితాలతో ముడివేసుకుని ఉన్నాయని చెప్పారు. అనేక రకాలైన కష్టాలే.. ఘంటసాలను మానవతామూర్తిగా నిలిచేలా చేశాయని చెప్పారు. ఘంటసాల.. తెలుగువీర లేవరా పాట వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేస్కున్నారు.

మెుదట్లో సినిమా రంగం బాధ్యతాయుతమైన పాత్ర పోషించేదని.. నేటి తరం సినిమా రంగాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సామాజిక స్పృహతో ఉన్న ఉన్న సినిమాలపైనే చర్చ అనేది జరుగుతుందని ఆయన అన్నారు.

ఎన్టీఆర్‌ను ‘మనదేశం’ చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం చేసిన నటి, నిర్మాత కృష్ణవేణిని జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ సందర్భంగా సన్మానించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రోశయ్యకు నివాళులు..
మాజీ సీఎం కొణిజెటి రోశయ్య పార్థీవదేహానికి జస్టిస్‌ ఎన్వీ రమణ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోశయ్య మరణం బాధ కలిగించిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి సీఎం, గవర్నర్‌ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఆయనకు కళలు, సాహిత్యంపై అభిమానం ఉందని చెప్పారు.

Also Read: CJI NV Ramana: న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదు... సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read: Navy Day 2021: ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మనదే.. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ప్రదర్శన 

Also Read: Shyam Singha Roy: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?

Also Read: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Also Read: వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: CJI justice nv ramana ghantasala birth anniversary Singer p susheela ravindra bharathi

సంబంధిత కథనాలు

Bjp: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ

Bjp: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Hyderabad Chicken: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..

Formula E Hyderabad : లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్.. "ఫార్ములా ఈ" కార్ రేసులకు వేదికగా భాగ్యనగరం !

Formula E Hyderabad :  లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్..

Breaking News Live: కడప మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. ఏకంగా 50 మందికి పాజిటివ్

Breaking News Live: కడప మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. ఏకంగా 50 మందికి పాజిటివ్

TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Lokesh Corona : నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Lokesh Corona :   నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Rashmika: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు.. 

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. ఫిబ్రవరి 20న పోలింగ్

Kadapa RIMS: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

Kadapa RIMS: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్